Year Ender 2024: ముఖేష్ అంబానీ ఈ సంవత్సరం వార్తల్లో ఎక్కువగా నిలిచిన వ్యాపారవేత్తల పేర్లలో ఒకటి. దేశంలోనే కాకుండా ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరిగా ఉన్న రిలయన్స్ అధినేత ఈ ఏడాది తన ఇన్వెస్టర్లకు మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. అంబానీ నేతృత్వంలో ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. స్టాక్ మార్కెట్లలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది మాత్రం తన ఇన్వెస్టర్లకు నిరాశాజనకమైన రాబడులను అందించింది. అవును ఇటీవలి నెలల్లో కంపెనీ షేర్లు ప్రతికూల రాబడులను అందించటంతో 2024ను స్టాక్ నెగటివ్ నోట్ లో ముగించనుంది. వాస్తవానికి గడచిన 10 ఏళ్ల కాలంలో కంపెనీ తొలిసారిగా ఒక సంవత్సరంలో తన ఇన్వెస్టర్లకు నెగటివ్ రిటర్న్స్ అందించటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు 2024లో అత్యద్భుతమైన రాబడిని అందించాయి. నిరంతరాయంగా కొనసాగిన బుల్ జోరు చాలా మంది ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించిన సంగతి తెలిసిందే. గడచిన 3 నెలల్లో నిఫ్టీ 50లో 8 శాతం వెయిటేజ్ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ విలువ దాదాపు 15 శాతం పతనాన్ని చూసింది. అలాగే గడచిన 5 ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ ధర 1.39 శాతం మేర పతనాన్ని చూసింది. అలాగే గత 6 నెలల రిటర్న్ పరిశీలిస్తే 14.20 శాతం పతనాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది తొలినాళ్లలో లాభాలను అందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రస్తుతం కొన్ని నెలలుగా నిరాశాజనకమైన రాబడులను అందిస్తూ వస్తోంది. సెప్టెంబరులో 2.2 శాతం, అక్టోబరులో 9.8 శాతం, నవంబరులో 3 శాతం, డిసెంబరులో 3.9 శాతం పడిపోయింది.
2014 తర్వాత తొలిసారిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మెుదటిసారిగా ఒక సంవత్సరం ఇన్వెస్టర్లకు నెగటివ్ రిటర్న్స్ అందించాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.17 లక్షల కోట్ల కంటే అధికంగా కొనసాగుతోంది. ఈరోజు ఇంట్రాడేలో రిలయన్స్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో మధ్యాహ్నం 1.50 గంటలకు పరిశీలిస్తే 1.7 శాతం పడిపోయి రూ.1,246.75 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది జరిగిన సర్వసభ్య సమావేశంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు రిలయన్స్ రిటైల్, జియో కంపెనీల ఐపీవోలకు సంబంధించి ప్రకటనలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
రిలయన్స్ నష్టాలకు కారణం ఏంటి?
రిలయన్స్ స్టాక్ తిరోగమనానికి కారణమైన కొన్ని సంభావ్య సవాళ్లను పరిశీలిస్తే.. రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న మార్జిన్ల ఒత్తిడి కంపెనీ షేర్లపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇదే క్రమంలో టెలికాం వ్యాపారం రిలయన్స్ జియోలో కంపెనీ ఇటీవలి త్రైమాసికాల్లో భారీగా వినియోగదారుల సంఖ్య కోల్పోవటం, అలాగే యూజర్ల నుంచి సగటు ఆదాయం కూడా ఊహించిన స్థాయిలో పెరగకపోవటం కంపెనీ ఆదాయాలను ప్రభావితం చేస్తోంది. అలాగే ఇషా అంబానీ నేతృత్వంలో ఉన్న రిలయన్స్ రిటైల్ రంగం కూడా పునర్నిర్మాణం, కన్సాలిడేషన్‌లో ఉండటం విలువ అన్ లాక్ చేయటాన్ని ఆలస్యం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో రిలయన్స్ అనేక కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు సైతం కంపెనీపై ప్రస్తుతం రుణాల కోసం వెళ్లేలా ఒత్తిడిని క్రియేట్ చేస్తోంది. అలాగే చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం కూడా రూ.5000 కోట్లకు పైగా ముఖేష్ అంబానీ వెచ్చించటం కొంత ఒత్తిడిని కలిగిస్తోందని తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications