Mutual Funds NFOs: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ప్రస్తుతం సామాన్య మధ్యతరగతి పెట్టుబడిదారులకు సైతం అందుబాటులోకి రావటంతో ఇన్వెస్టర్ల సంఖ్య నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. పెట్టేది చిన్న మెుత్తమే అయినప్పటకీ వీటి ద్వారా ఇండియాలో పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ప్రజలు వీటి వెనుక పరిగెట్టడంతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా కొనసాగుతోంది.
వాస్తవానికి 2024ను చూస్తే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిరంతరం కొత్త ఫండ్లను లాంచ్ చేయటంలో బిజీబిజీగా కాలాన్ని గడిపాయి. ఈ క్రమంలో ఫండ్ కంపెనీలు ఏకంగా 205 కొత్త స్కీమ్స్ లాంచ్ చేసి రికార్డు సృష్టించాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఒకే సంవత్సరం స్కీమ్స్ విడుదల కాలేదని తెలుస్తోంది. వీటిలో యాక్విట్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ ను డెట్-ఈక్విటీ సెగ్మెంట్లలో సైతం వివిధ ఫండ్లను కంపెనీలు రిలీజ్ చేశాయి. అయితే వీటిలో డిసెంబర్ నెలలో వచ్చిన కొత్త ఫండ్ల వివరాలను మాత్రం చేర్చలేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇన్వెస్టర్ల నుంచి 2024లో మ్యూచువల్ ఫండ్ కంపెనలు కేవలం తమ కొత్త ఫండ్ ఆఫర్ల ద్వారా రూ.1.04 లక్షల కోట్లను సంయుక్తంగా సమీకరించినట్లు సమాచారం. ఇక్కడ ప్రధానంగా 198 ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ద్వారా రూ.1.03 లక్షల కోట్లు రైజ్ చేయబడ్డాయి. ఇక ఎక్కువ ఏ కేటగిరీ కింద ఫండ్స్ వచ్చాయని పరిశీలిస్తే.. ఇండెక్స్ ఫండ్స్ ముందువరుసలో 76 కొత్త ఫండ్లను కలిగి ఉంది. ఈ ఫండ్స్ ఏకంగా రూ.11,896 కోట్లను సమీకరించినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా ప్రకారం వెల్లడైంది. ఇదే క్రమంలో ఈటీఎఫ్ స్కీమ్స్ 41 ఈ ఏడాది ప్రారంభించబడ్డాయి. మూడో స్థానంలో అత్యధికంగా థీమ్యాటిక్ ఫండ్స్ 40 వరకు అసెట్ మెనేజ్మెంట్ కంపెనీల నుంచి ప్రారంభించబడ్డాయి.
2024లో బెస్ట్ రిటర్న్స్ అందించిన మ్యూచువల్ ఫండ్స్..
ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు చారిత్రాత్మక ర్యాలీతో గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసిందే. అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ విభాగంలోని కంపెనీల షేర్లు అద్భుత పనితీరును కనబరచటంతో ఆ కేటగిరీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ ఆశ్చర్యకరమైన రాబడులతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ఈ క్రమంలో మిడ్-క్యాప్ ఫండ్ సంవత్సరానికి దాదాపు 25-30% రాబడిని అందించగా, స్మాల్-క్యాప్ ఫండ్స్ 35% కంటే ఎక్కువ రాబడిని తెచ్చిపెట్టాయి. కానీ ఇప్పుడు మార్కెట్లు కరెక్షన్ మోడ్ లో ఉన్నందున పెట్టుబడిదారులు బ్లూ చిప్ ఫండ్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో మంచి రాబడులను అందించిన ఫండ్స్ వివరాలను పరిశీలిస్తే.. హెచ్‌డిఎఫ్‌సి ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ ఒక సంవత్సరం సిప్‌పై 54.12 శాతం రాబడిని ఇచ్చింది. ICICI ప్రుడెన్షియల్ PSU ఈక్విటీ ఫండ్ రెండేళ్ల SIPపై 44.25% వార్షిక రాబడిని ఇచ్చింది. HDFC డిఫెన్స్ ఫండ్ ఒక సంవత్సరం SIP పై 70% రాబడిని ఇచ్చింది. అలాగే ఒకేసారి పెట్టుబడి పెట్టిన వారు ఒక సంవత్సరంలో 82.43% మరియు ప్రారంభించినప్పటి నుండి సంవత్సరానికి 80.24% రాబడిని పొందారు. SBI నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ 3-సంవత్సరాల SIPపై 29.13% వార్షిక రాబడిని తెచ్చిపెట్టింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications