Mutual Fund Returns: దేశంలో ఎన్నడూ చూడని రీతిలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రస్తుతం కొనసాగుతోంది. మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా వ్యాపారం దినదినాభివృద్ధిని సాధిస్తోంది. ఈ క్రమంలో చిన్న పెట్టుబడిదారులు సైతం వీటిలో భాగస్వాములుగా మారటంతో భారీ స్థాయిలో కొత్త ఫండ్స్ రాక కొనసాగుతోంది. తెలివైన ఇన్వెస్టర్లు ఈక్విటీల కంటే మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో భారీగా డబ్బు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి మళ్లించబడుతున్నాయి.
అయితే 2024లో కొనసాగిన బుల్ ర్యాలీ కారణంగా కొన్ని ఫండ్స్ మంచి పనితీరుతో పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ ఏడాది మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో డబ్బు పెట్టిన ఇన్వెస్టర్లు ఉత్తమ రాబడులను అందుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 30 శాతం కంటే ఎక్కువ రాబడితో 9 పథకాలు ఉన్నాయి. మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోని కంపెనీలు చూసిన కొనుగోలు ర్యాలీ ఈ కేటగిరీ ఫండ్స్ అత్యుత్తమ పనితీరును కనబరచటానికి కారణంగా నిలిచాయి.

మంచి రాబడులతో ఉత్తమ పనితీరును కనబరిచిన వివిధ ఫండ్స్ వివరాలను పరిశీలిస్తే.. మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అత్యధికంగా 46.55 శాతం రాబడితో అగ్రస్థానంలో నిలిచింది. 2024లో దీని తర్వాత ఉత్తమ పనితీరు కనబరిచిన ఇతర ఫండ్స్ వివరాలను పరిశీలిస్తే.. HSBC లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 42.77 శాతం రాబడితో రెండవ స్థానంలో నిలిచింది. ఇక టాప్-3 పర్ఫార్మర్లలో ఇన్వెస్కో ఇండియా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 40.88 శాతం రాబడితో నిలిచింది.
ఇక తర్వాత 30 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించిన ఫండ్స్ వివరాలను పరిశీలిస్తే.. బంధన్ కోర్ ఈక్విటీ ఫండ్ 32 శాతం, యూటీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 31.29 శాతం, ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 31.10 శాతం తిరిగి ఇచ్చాయి. బరోడా BNP పారిబాస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 30.79 శాతం, కెనరా రోబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ 30.61 శాతం, నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ 30.19 శాతం రాబడితో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు దాదాపు 3-4 రూపాయల వడ్డీ ఆదాయాన్ని పెట్టుబడిదారులకు అందించాయి. ఇదే క్రమంలో 20 శాతానికి పైగా రాబడిని అందించిన ఫండ్స్ వివరాలను పరిశీలిస్తే.. యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ 29.85 శాతం రాబడిని ఇచ్చింది. SBI లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 21.89 శాతం, మిరాయ్ అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 20.49 శాతం రాబడితో ఉన్నాయి.


Click it and Unblock the Notifications