IPO News: ఈ ఏడాది చివరికి వస్తున్న లక్కీ ఐపీవో.. ట్రేడర్స్ డోన్ట్ మిస్ చాన్స్, పూర్తి వివరాలు..

Year Ender 2024: డబ్బు ఎవరికీ ఊరికే రాదు సార్ అనే సామెత మనలో చాలా మంది వినే ఉంటాం. అయితే ఈక్విటీలతో పోల్చితే ఐపీవోల్లో వేగంగా రాబడి రావటాన్ని చాలా మంది పెట్టుబడిదారులు ప్రస్తుతం ఆకర్షనీయంగా భావిస్తున్నారు. అయితే డిసెంబర్ చివరి వారంలో ఐపీవోల రద్దీ ఊపిరిసలపకుండా చేస్తోంది. ఈ క్రమంలో 2024కి చివరి ఐపీవో వివరాల గురించి అందరిలోనూ ఆతృత కొనసాగుతోంది.

కేవలం డిసెంబర్ నెలలో దాదాపు 19 పెద్ద కంపెనీల ఐపీవోలు స్టాక్ మార్కెట్లను తాకాయి. ఒకదాని తర్వాత మరొకటి లిస్ట్ అవుతూ ఇన్వెస్టర్లకు కుప్పలుకుప్పలుగా రాబడిని తెచ్చిపెట్టాయి. పైగా రిటైల్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 31న అందుబాటులోకి వస్తున్న ఒక కంపెనీ ఐపీవోపై పెట్టుబడిదారుల దృష్టి కొనసాగుతోంది. డిసెంబర్ 27న దాదాపు 5 కంపెనీల ఐపీవోలు లిస్టింగ్ కోసం వస్తున్నాయి. ఈ క్రమంలో అందరి చూపు ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీవోపైనే కొనసాగుతోంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో డిసెంబర్ 30, 2024న రాబోతోంది.

Year Ender 2024 Know complete details about last IPO coming in main catagery on DEC 31st 2024

కంపెనీ తన ఐపీవో పరిమాణాన్ని ప్రకటించనప్పటికీ తాజా ఐపీవో ద్వారా మెుత్తం 1.21 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచాలని నిర్ణయించింది. ఇందులో 0.86 కోట్ల తాజా ఈక్విటీ షేర్లు ఉంటుండగా, మిగిలిన 0.35 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో జాబితా అవుతాయని తెలుస్తోంది. రణబీర్ సింగ్ ఖడ్వాలియా ఓఎఫ్ఎస్ కింద వాటాలను విక్రయించనున్నారు. ఆర్యమాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి వచ్చే డబ్బులో రూ.70 కోట్లను తయారీ సామర్థ్యాల విస్తరించటానికి ఉపయోగించాలని నిర్ణయించింది. కొంత భాగాన్ని రుణ చెల్లింపులకు కూడా వినియోగించనుంది.

కంపెనీ వ్యాపారం..
1994లో స్థాపించబడిన ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్.. ట్రాక్టర్‌ల, పిక్ అండ్ క్యారీ క్రేన్స్, వివిధ హార్వెస్టింగ్ మెషినరీల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీ తన ఉత్పత్తులను దేశంలో ఇండో ఫార్మ్, ఇండో పవర్ అనే రెండు బ్రాండ్ల కింద విక్రయాలు చేపడుతోంది0. అలాగే కంపెనీ తన ఉత్పత్తులను నేపాల్, సిరియా, సుడాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ 16 హార్స్ పవర్ నుంచి 110 హార్స్ పవర్ వరకు ట్రాక్టర్ల తయారీలో ఉంది. ఇదే క్రమంలో 9 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల పికప్ అండ్ క్యారీ క్రేన్ల తయారీలో ఉంది. కంపెనీకి బద్ది హిమాచల్ ప్రదేశ్ లో తయారీ కేంద్రం కూడా ఉంది. కంపెనీ ఏటా 12,000 ట్రాక్టర్లు, 1,280 పిక్ అండ్ క్యారీ క్రేన్‌లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+