Stock Market: 2024లో భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసిన విషయాలివే..?

Year Ender 2024: భారతీయ స్టాక్ మార్కెట్లు వాస్తవానికి 2024లో భారీగా ప్రగతిని సాధించాయి. ఈ క్రమంలో బుల్స్ జోరు నిరంతరాయంగా కొనసాగటంతో పాటు ఐపీవోల కోలాహలం, మ్యూచువల్ ఫండ్స్ నిధులను మార్కెట్లలలోకి తీసుకురావటం వంటివి జోరుకు ఊతం ఇచ్చాయి. ఈ క్రమంలో ప్రధానంగా గుర్తించదగినది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి మార్కెట్ల స్థిరత్వానికి అండగా నిలవటమే. అందుకే ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు ఉత్తమ పనితీరుతో రాబడులను అందించగలిగాయి.

ఈ ఏడాది బెంచ్ మార్క్ సూచీలు తమ ర్యాలీతో గోల్డ్ తో పోటీగా రాబడులను అందించటం గమనార్హం. అయితే మార్కెట్లు పతాన్ని ప్రేరేపించిన అనేక కీకల పరిణామాలు 2024లో భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రభావం ఈక్విటీ మార్కెట్లపై భారీగా కనిపించింది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు భారీగా బెట్టింగ్ వేశారు. అయితే చివరికి బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవటంతో మార్కెట్లు స్థిమితపడ్డాయి. దీని తర్వాత మార్కెట్లను ఈ ఏడాది ఎక్కువగా ప్రభావితం చేసిన అంశాల్లో రెండవది మాంద్యం భయాలు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, అస్థిరతలతో చాలా దేశాలు మాంద్యం భయాన్ని చూశాయి. ఈ క్రమంలో అమెరికాలోని అనేక బ్యాంకులు వరుసగా దివాలా కూడా తీయటంతో ప్రపంచ దేశాలు వణికిపోయాయి. ప్రధానంగా అదుపులోకి రాని ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంకులకు ముచ్చెమటలు పట్టించింది.

Year Ender 2024 Know 6 factors that impacted Indian Stock markets in 2024 in detail

ఇక ఎప్పటి మాదిరిగానే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా మార్కెట్లను కొంత ప్రభావితం చేసింది. ప్రభుత్వం కీలకంగా భావించి డబ్బు వెచ్చించిన రంగాల్లోని కంపెనీల షేర్లు దీంతో ప్రభావితం అయ్యాయి. అలాగే ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య మెుదలైన యుద్ధం మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులను కలిగించింది. ఈ యుద్ధం క్రూడ్ ఆయిల్ ధరలను సైతం భారీగా ప్రభావితం చేసింది. ఇరాన్ పై యుద్దం చమురు ధరల పెరుగుదలకు దారితీయటంతో పాటు ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపించిందని నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ అస్థిరతలు మార్కెట్ల స్థిరత్వానికి ఎల్లప్పుడూ విఘాతంగానే నిలుస్తాయి.

ఇక మార్కెట్లలో పెద్ద సంచలనంగా నిలిచిన మరొక అంశం అదానీపై అమెరికా కోర్టులో జరుగుతున్న దర్యాప్తు. సోలార్ విద్యుత్ విక్రయాల కోసం చేసుకున్న ఒప్పందాల్లో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ప్రభావితం చేసేందుకు, తనకు అనుకూలంగా డీల్స్ కుదుర్చుకునేందుకు అదానీ లంచం ఎరచూపినట్లు ప్రాథమికంగా వెల్లడికావటంతో ఇది మార్కెట్లతో పాటుగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కుదిపేసింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలకు వేల కోట్లు లంచాలు చేతులుమారినట్లు ఆరోపణలు గుప్పుమనటంతో గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న డీల్ రద్దు చేసుకోవాలా లేక మార్పులతో కొనసాగించాలా అనే డైలమాలో చంద్రబాబు సర్కార్ ఏపీలో ఉంది. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విక్టరీ కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో కొంత ర్యాలీకి దోహదపడింది. కానీ ట్రంప్ అగ్రసివ్ నిర్ణయాలు చేటు చేస్తాయనే భయాలు కూడా మార్కెట్లను వెంటాడుతున్నాయి.

ఇక చివరిగా ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో పతానికి కారణంగా విదేశీ మదుపరులు నిలిచారు. గడచిన కొన్ని నెలలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వరుసగా విక్రయిస్తూ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. చైనా మార్కెట్లు తిరిగి గాడిన పడుతున్న వేళ వీరు తమ డబ్బును భారత మార్కెట్ల నుంచి తరలించటం కూడా దీనికి కారణంగా నిలిచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+