బంగారం ధర ప్రస్తుతం 80వేలకి దగ్గరలో ఉండగా వెండి కూడా పసిడి బాటలోనే లక్షకి చేరువలో ఉంది. అయితే ఇండియాలో ఏ శుభకార్యానికైనా బంగారం కొనడం ఆనవాయితీ. ఇంకా మహిళలు ఎక్కువగా ఇష్టపడేది కూడా బంగారమే. మన దగ్గర బంగారం ధర ప్రతిరోజు మారుతుంటుంది. పసిడి ధర మారడానికి చాల కారణాలు ఉంటాయి. దేశీయ ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ ఫలితంగా భారతదేశంలో బంగారం ధరలు పడిపోతూ పెరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుండి డిసెంబర్ వరకు బంగారం ధరలు వివిధ కారణాల వల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఇందులో ముఖ్యమైనవి ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. బంగారం ధర పెరుగుదల కొన్నిసార్లు రికార్డు స్థాయికి చేరింది. అయితే ఒక్క ఈ ఏడాదిలోనే బంగారం ధరలు ఎంతలా మారాయో తెలుసా...
జనవరి 2024లో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,970. ఈ సమయంలోనే బంగారం ధరలు క్రమంగా పెరగడం ప్రారంభించాయి. జనవరి 24న బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.64,430కి చేరగా, జనవరి 31న 10 గ్రాములకు రూ.63,970కి చేరింది.

ఫిబ్రవరి 2024లో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.63,992, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.58,617. 26 ఫిబ్రవరి 2024న వివిధ నగరాల్లో బంగారం ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఉదాహరణకు, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.64,230 ఉండగా, కోల్‌కతా, బెంగళూరులో 10 గ్రాములకు రూ.64,240గా ఉంది.
మార్చి 2024లో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,270కి చేరుకుంది, జనవరితో పోలిస్తే దాదాపు రూ.2,000 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు, ఢిల్లీలో 10 గ్రాములకు రూ.69,135, కోల్‌కతాలో 10 గ్రాములకు రూ.69,471కి చేరుకుంది.
ఏప్రిల్ 2024లో బంగారం ధరలు సరికొత్త రికార్డు బ్రేక్ చేసాయి. ఏప్రిల్ 9న MCXలో బంగారం ధర 10 గ్రాములకు రూ.71,026. ఏప్రిల్ చివరి నాటికి, వివిధ నగరాల్లో బంగారం ధరలు రూ.72,000 నుండి రూ.75,000 మధ్య ఉన్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.75,574కి చేరుకుంది.
మే 2024లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 1న, బంగారం ధర ఒక గ్రాముకు రూ.6,998 కాగా, మే 6న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,544గా ఉంది. మే 20న, బంగారం ధర గ్రాముకు రూ.7,350కి చేరుకుంది.
జూన్ 2024లో బంగారం ధరలలో కొంత స్థిరత్వం కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.75,074 ఉండగా జూన్ 29న 10 గ్రాములకు రూ.72,676గా మారింది.
జూలై 2024లో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల చూసింది. జూలై 31న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6,882 ఉండగా, జూలై 27న అది గ్రాముకు రూ.6,900 అయింది.
ఆగస్టు 2024లో బంగారం ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. చెన్నై, కోల్‌కతా, ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,680కి చేరుకుంది.
సెప్టెంబరు 2024లో బంగారం ధరలు గ్రాముకు రూ.7,571కి చేరాయి. కానీ చివరకు సెప్టెంబరు 30 నాటికి గ్రాము ధర రూ.7,095కి తగ్గింది.
అక్టోబర్ 2024లో బంగారం ధర కొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 18న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,210 ఉండగా, అక్టోబర్ 25న రూ.78,064కి చేరుకుంది. అక్టోబర్ 28న బంగారం ధర 10 గ్రాములకు రూ.80,430కి చేరుకుంది.
నవంబర్ 2024లో బంగారం ధరలు మారాయి. నవంబర్ 30న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,270.
డిసెంబర్ 2024లో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. డిసెంబర్ 13న ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 79,620 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.7,3000గా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications