FII Selling in 2024: మరో వారం రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులను నమోదు చేశాయి. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల సునామీకి కారణం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్లకు మద్దతు లేకపోవటమే. మార్కెట్లు ఓవర్ వ్యాల్యుయేషన్ కావటంతో పాటు చైనా మార్కెట్లు ఆకర్షనీయంగా మారటంతో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లను విడిచిపెట్టారు.
ఈ క్రమంలో భారతీయ మార్కెట్లలో పెట్టుబడులను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 2024లో విక్రయించారు. ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది దాదాపు రూ.లక్ష కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం గమనార్హం. ఈ క్రమంలో ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్స్ రంగాల నుంచి పెట్టుబడులు తరలిపోయాయి. అయితే గడచిన శుక్రవారం భారతీయ మార్కెట్లలో కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ పెట్టుబడిదారులు రూ.6,770 కోట్లు కొత్త పెట్టుబడులు చేశారు. ఈ క్రమంలో జనవరి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఫారెన్ ప్రైవేట్ ఇన్వెస్టర్లు నికర అమ్మకదారులుగా నిలిచారు.

ఈ ఏడాది సెప్టెంబరులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.57,724 కోట్లు అత్యధికంగా భారతీయ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారు. దీని తర్వాత మార్చిలో రూ.35,098 కోట్లతో రెండవ అతిపెద్ద ఇన్ ఫ్లోలు, జూలై మాసంలో రూ.32,365 కోట్లు భారతీయ మార్కెట్లలోకి తరలించారు. అలాగే ఈ ఏడాదిలో ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ & ఆటో కాంపోనెంట్స్, కన్‍స్ట్రక్షన్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్, మెటల్స్ & మైనింగ్, పవర్ సహా ఇతర రంగాలు వరుసగా రూ.19,057 కోట్లు, రూ.14,148 కోట్లు, రూ.20,163 కోట్లు, రూ.2,244 కోట్లు, రూ.799 అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో అమ్మకాలను చూశాయి. అయితే 2025లో వారు తిరిగి వస్తారా లేదా అనే విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
2024లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, టెలికాం, కన్జూమర్ సర్వీసెస్, ఐటీ, రియల్టీ హెల్త్ కేర్ వంటి రంగాల్లో కొనుగోలుదారులుగా నిలిచారు. ఇక ఇదే సమయంలో.. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్‍స్ట్రక్షన్, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా, మెటల్స్ అండ్ మైనింగ్, పవర్ రంగాల్లో మాత్రం తమ పెట్టుబడుల అమ్మకాలను చేపట్టారు. అలాగే 2025లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద సమస్యగా మిగిలిపోయింది. సుంకాలపై ఆయన వైఖరి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని నిపుణులు సైతం భావిస్తున్నారు. అలాగే ఫెడ్ కూడా దీనికి అనుగుణంగా వడ్డీ రేట్ల కోత తక్కువగానే ఉంటుందని పేర్కొనటం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ నిర్థేశించుకున్న 2% ద్రవ్యోల్బణ లక్ష్యం 2025లో సాధించే అవకాశం లేదని జెరోమ్ పావెల్ చెప్పడం పెట్టుబడిదారుల్లో ఆందోళలను పెంచేస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications