కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులు ప్రస్తుతం అలసట, ఊబకాయం ఇంకా మధుమేహం వంటి వ్యాధులతో పోరాడుతున్నారు . ఈ వ్యాధులన్నింటికీ ఒకే ఒక కారణం అని తెలుస్తుంది. అదే నిద్రలేమి. నిజానికి, ఈ రోజుల్లో టెక్ కంపెనీలలో పనిచేసే చాలా మంది నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర లేకుండా పోతుంది. ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు సరైన నిద్ర పొందడానికి స్లిప్ ఎక్స్పర్ట్స్ (sleep experts)ను ఆశ్రయిస్తున్నారు.

ఎక్కువ పని గంటలు, నిరంతరం పని చేయాలనే ఒత్తిడి, కలుషితమైన ఆఫీస్ కల్చర్, ఉద్యోగ అభద్రత, డిజిటల్ డివైజెస్ వినియోగం పెరగడం ఇవన్నీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నిటికంటే వీరికి నిద్ర మాయమవుతుంది. ఈ కారణంగా వారు ప్రతిరోజు అలసిపోవడం, నీరసంగా ఇంకా చిరాకుగా ఉంటారని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఇంకా ఏకాగ్రతతో కూడా ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం అలాగే గందరగోళం వంటి చాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
కోపం తెచ్చుకోవడం, అరవడం అలవాటు: ఢిల్లీలోని న్యూరాలజీ స్లీప్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మన్వీర్ భాటియా మాట్లాడుతూ ఒక స్టార్టప్ కంపెనీ హెడ్ తన వద్దకు వచ్చారని, అతను వర్క్'లో చాలా త్వరగా కోపాన్ని కోల్పోయి ఉద్యోగులపై అరుస్తూ ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అతనికి దాదాపు 30 సంవత్సరాలు, 4 నుండి 4.5 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు అని చెప్పారు. అంతేకాదు దీనికి తోడు మరో కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఒక పెద్ద హోటల్‌లో పనిచేసే వ్యక్తి ప్రతిరోజు ట్రావెలింగ్ చేసేవాడు. దింతో నిద్రపోవడానికి ట్యాబ్లేట్స్ వేసుకోవలసి వచ్చేది, దింతో అతను వాటికి బానిసయ్యాడు. కానీ ఇప్పుడు అతను సహాయం కోసం సంప్రదించాడు.
మూడు రెట్లు పెరిగిన రోగులు: డాక్టర్ భాటియా ఇప్పుడు ప్రతిరోజూ గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువ మంది రోగులను చూస్తున్నానని చెప్పారు. ఇప్పుడు చూసే రోగుల సంఖ్య COVID కి ముందు చూసిన దానికంటే చాలా ఎక్కువ. కార్పొరేట్ ఉద్యోగుల పని గంటలు భారీగా పెరిగాయి. చాలా మంది కూర్చొని పని చేస్తారని ఆమె చెప్పింది.
ఈ వయసులోని వారికీ ఎక్కువ ఇబ్బంది: 30 నుండి 40 ఏళ్ల వయస్సులో ఉన్న వారికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది" అని డాక్టర్ భాటియా అంటున్నారు. ఇంకా బరువు పెరగటం, స్లీప్ అప్నియాకు దారితీస్తుంది. అలాగే డయాబెటిస్, అధిక రక్తపోటు ఇంకా జ్ఞాపకశక్తి లోపం వంటి సమస్యలు వస్తాయి. ఈ కారణంగా, పని చేసే సామర్థ్యం తగ్గుతుంది, ఎక్కువ సెలవులు తీసుకోవడం ప్రారంభిస్తారు.


Click it and Unblock the Notifications