IPO News: లాభాలతో లిస్టింగ్ అయిన యథార్త్ హాస్పిటల్స్.. సంతోషంలో ఇన్వెస్టర్లు..
Yatharth Hospital IPO: కొత్త వారం ప్రారంభంలోనే మార్కెట్లోకి యథార్త్ హాస్పిటల్ ఐపీవో లిస్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
సోమవారం మార్కెట్లో యథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామాకేర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో లిస్టింగ్ పూర్తయింది. తొలిరోజు ఇది నెమ్మదైన లాభాలతో జాబితా చేయబడింది. అయితే లిస్టింగ్ జరిగిన కొద్ది సేపటికే కంపెనీ షేర్లు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో ఇష్యూ ధరకు 13% ప్రీమియంతో ట్రేడయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో షేరు ధర రూ.342.70కి చేరుకుంది. అయితే 11.35 గంటల సమయంలో స్టాక్ ధర రూ.331 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

యథార్త్ హాస్పిటల్ ఐపీవో ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.285-300గా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.490 కోట్ల విలువైన కొత్త షేర్లు మార్కెట్లోకి జారీ అయ్యాయి. దీనికి తోడు 65,51,690 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కిందకు విక్రయించారు. ఈ విధంగా మొత్తం ఐపీవో నుంచి రూ.686.55 కోట్లను కంపెనీ సమీకరించింది. ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, ఆంబిట్, IIFL సెక్యూరిటీస్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా వ్యవహరిస్తున్నాయి. అయితే లింక్ ఇన్‌టైమ్ ఇండియా ఇష్యూకి రిజిస్ట్రార్‌గా నియమించబడింది.

2008లో యథార్త్ హాస్పిటల్ అనేది నోయిడా, గ్రేటర్ నోయిడా, నోయిడా ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న నాలుగు-సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లను నిర్వహించే ఒక హాస్పిటల్ చైన్ గా ఉండేది. సంస్థ తన కార్యకలాపాలు, సేవలను విస్తరించేందుకు తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 305 పడకల ఆసుపత్రిని కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications