కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి 'కేజీఎఫ్' (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా 'రాకీ భాయ్'గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యష్(Yash) నేడు తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా యష్ ప్రయాణం ఒక సినిమాను తలపిస్తుంది.

ఒకప్పుడు రోజుకు రూ. 50 జీతం.. నేడు కోట్లు!
యష్ ప్రయాణం చాలా సాదాసీదాగా మొదలైంది. 16 ఏళ్ల వయసులో అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనే కలలతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఒకానొక దశలో బ్యాక్‌స్టేజ్ అసిస్టెంట్‌గా రోజుకు కేవలం రూ. 50 కే పనిచేశారు. 2004లో 'ఉత్తరాయణ' అనే టీవీ సీరియల్ ద్వారా తన కెరీర్ ప్రారంభించి, మెల్లమెల్లగా కన్నడ చిత్రసీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 'మొగ్గిన మనసు' సినిమాతో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న యష్.. ఆ తర్వాత 'గూగ్లీ' అనే హిట్ మూవీతో స్టార్ గా ఎదిగారు.
రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. 'టాక్సిక్' రేంజ్ సంపాదన!
ప్రస్తుతం యష్(Yash) నికర ఆస్తుల విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు ఆయన సుమారు రూ. 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. 'కేజీఎఫ్' ఘనవిజయం తర్వాత ఆయన బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. పెప్సీ, కోకాకోలా, మింత్రా, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి దిగ్గజ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, ఒక్కో యాడ్ కోసం రూ. 60 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా 'విలన్' (Villain) అనే తన స్వంత పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ ను కూడా నడుపుతున్నారు.
విలాసవంతమైన ఇల్లు, కార్లు
యష్ తన భార్య రాధికా పండిట్‌తో కలిసి బెంగళూరులోని అత్యంత విలాసవంతమైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్ (విండ్సర్ మేనర్) లో నివసిస్తున్నారు. సుమారు రూ. 4 కోట్ల విలువైన ఈ డ్యూప్లెక్స్ ఇల్లు మోడ్రన్ ఎలిగెన్స్‌కు నిలువుటద్దం. ఆయన కార్ల కలెక్షన్ విషయానికొస్తే.. యష్ గ్యారేజీలో రూ. 2 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆయన నిత్యం వాడే రేంజ్ రోవర్ ఎవోక్ విలువ రూ. 60 లక్షలు. వీటితో పాటు మెర్సిడెస్ బెంజ్ GLC 250D, 350D వంటి ఖరీదైన కార్లు ఆయన హోదాను చాటిచెబుతాయి.
ముందున్న అసలైన సవాలు!
వచ్చే ఏడాది మార్చిలో 'టాక్సిక్' (Toxic) సినిమా విడుదలతో పాటు, నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణం'లో కూడా యష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్చి 2026లో భారీ సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ యష్‌కు ఉన్న మాస్ అప్పీల్, మూవీ మేకింగ్ స్టైల్ ను బట్టి చూస్తే.. బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం.
సున్నా నుంచి మొదలై నేడు మిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన యష్ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. హ్యాపీ బర్త్ డే రాకింగ్ స్టార్!
More From GoodReturns

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications