Dividend Stock: నేడే చివరి అవకాశం.. ఒక్కో షేరుకు రూ.400 డివిడెండ్, పూర్తి వివరాలు..

Yamuna Syndicate Stock: కార్పొరేట్ ఫలితాల తర్వాత అనేక కంపెనీలకు చెందిన డివిడెండ్ ఆఫర్లను అందిపుచ్చుకునేందుకు కొందరు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇలా మంచి డివిడెండ్ ఆదాయాన్ని ఇచ్చే షేర్లకు నిజంగా మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది యమునా సిండికేట్ లిమిటెడ్ స్టాక్ గురించే. ఈ కంపెనీ భారీ స్థాయిలో తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఆఫర్ చేస్తున్నందున అనేక మంది దృష్టి కంపెనీ షేర్లపై మార్కెట్లో కొనసాగుతోంది. అయితే డివిడెండ్ కోసం షేర్లపై బెట్టింగ్ వేయాలనుకునే ఇన్వెస్టర్లకు నేడు అంటే ఆగస్టు 23 చివరి రోజని గుర్తుంచుకోండి. ఎందుకంటే కంపెనీ షేర్లు నేడు మార్కెట్లో ఎక్స్-డివిడెండ్‌గా ట్రేడవనున్నాయి. ఈ క్రమంలో గురువారం కంపెనీ షేర్లు మార్కెట్లో అప్పర్ సర్క్యూట్ తాకాయి.

Yamuna Syndicate Stock giving 400 per share as dividend last day to get eligibility

అర్హులైన ఇన్వెస్టర్లు కలిగి ఉన్న ఒక్కో షేరుకు రూ.400 డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే స్టాక్ మార్కెట్ల రికార్డు తేదీని ఆగస్టు 23, 2024గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ఈ రోజు కంపెనీ రికార్డ్ బుక్‌లో షేర్ హోల్డర్లుగా పేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే డివిడెండ్ ప్రయోజనం లభించనుంది. అందుకే డివిడెండ్ కావాలనుకునే ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ తన చరిత్రలో అత్యధికంగా ఒక్కో షేరుకు రూ.400 డివిడెండ్ అందించటం ఇదే తొలిసారి. దీనికి ముందు సారి షేరుకు రూ.325ను డివిడెండ్ రూపంలో చెల్లించింది.

ఇక కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే నిన్న మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ధర రూ.56,175గా ఉంది. పైగా స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కూడా తాకింది. గడచిన మూడు నెలల కాలంలో కంపెనీ షేర్ల ధర ఏకంగా 82 శాతం పెరుగుదలను చూసింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.66,999గా ఉండగా నేడు మార్కెట్లో రూ.57,800 వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1776 కోట్లుగా ఉంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+