Bumper Dividend: అప్పులు లేని కంపెనీ.. ఒక్కో షేరుకు రూ.325 డివిడెండ్ చెల్లిస్తోంది..
Bumper Dividend: ఒక్క పైసా కూడా అప్పులు లేని కంపెనీ ప్రకటన మార్కెట్లో సంచనాలు సృష్టిస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం భారీ మెుత్తంలో డివిడెండ్ ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది స్మాల్ క్యాప్ కేటగిరీలోని యమునా సిండికేట్ లిమిటెడ్ షేర్ గురించే. కంపెనీ FY23కి 325% తుది డివిడెండ్ ప్రకటించింది. ఈరోజు మార్కెట్లు ముగిసే సమయంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ విలువ రూ.13,399గా ఉంది. ఈ కంపెనీ కమర్షియల్ సర్వీస్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తుందని చెప్పండి. కంపెనీ అనేక రకాల ఉత్పత్తుల వ్యాపారం, మార్కెటింగ్‌లో నిమగ్నమై ఉంది. ఆటో పరిశ్రమకు సంబంధించిన భాగాలు, వ్యవసాయ రసాయనాలు, పారిశ్రామిక అండ్ వినియోగదారు ఎలక్ట్రికల్స్ వ్యాపారంలో ఉంది.

కంపెనీ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.325 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి దీనిని అందిస్తోంది. కంపెనీ గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనికి ఒక్క పైసా కూడా అప్పు లేదు. 1954లో స్థాపించబడిన ఈ కంపెనీలో 2022 నాటికి 36 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.15.05 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. ఈ క్రమంలో కంపెనీ నికర లాభం రూ.61 లక్షలుగా ఉంది.యమునా సిండికేట్ యొక్క EPS Q3FY23లో రూ.13.98 నుంచి Q4FY23లో రూ.19.79కి పెరిగింది. FY22-23లో దాని ఆదాయం రూ.68.38 కోట్లకు చేరుకోగా, నికర లాభం రూ.8.88 కోట్లుగా ఉంది. కంపెనీ తన Q1FY24 ఫలితాలను ఇంకా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications