వాషింగ్టన్: యాహూ.. ఒకప్పటి సోషల్ మీడియా దిగ్గజం. గూగుల్‌తో పోటీ పడుతూ టాప్ సెర్చింజిన్‌గా ఒక వెలుగు వెలిగింది. ఇ-మెయిల్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా సత్తా చాటింది. ఆ తరువాత తెర మరుగైంది. తన ప్రాభవాన్ని కోల్పోయింది. రేసులో నిల్చోలేకపోయింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాలేక పోయిందా సెర్చింజిన్. అదే సమయంలో గూగుల్ సునామీలా దూసుకుని వచ్చింది. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది.
ఇప్పుడు మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించుకుంది. జిమ్ ల్యాంజోన్ యాహూ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అపాయింట్ అయ్యారు. ఇదివరకు ఆయన టాప్ డేటింగ్ యాప్ టిండర్‌లో పని చేశారు. వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ నుంచి యాహూను అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ దీన్ని కొనుగోలు చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.

అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్.. ఈ నెల 1వ తేదీన అయిదు బిలియన్ డాలర్లతో వెరిజోన్ మీడియాను కొనుగోలు చేసింది. ఈ వెరిజోన్ మీడియాలో ఏఓఎల్, టెక్‌క్రంచ్, మేకర్స్, ర్యోట్, ఫ్లర్రీ బ్రాండ్స్ కొనసాగుతున్నాయి. దీన్ని మరింత విస్తరించాలని ప్రాథమికంగా నిర్ణయించుకుంది అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్. యాహూ ఫైనాన్స్, యాహూ స్పోర్ట్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా దాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది.
ఇలాంటి భారీ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో- యాహూ ఇంటర్నెట్ విభాగం కోసం అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ కొత్త సీఈఓగా జిమ్ ల్యాంజోన్‌ను నియమించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డేటింగ్ యాప్ టిండర్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పని చేశారు. అదే హోదాలో ఆయనకు యాహూలో పోస్ట్ ఇచ్చింది. మూడేళ్ల కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. ఆ తరువాత కూడా దాన్ని కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.
కాగా- ఇంటర్‌నెట్ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న ఎలాంటిదో తెలిసిందే. కొత్త కొత్త ప్లాట్‌ఫామ్స్ పుట్టుకొస్తోన్నాయి. ఇ-కామర్స్ సెక్టార్ విస్తరించింది. భారీగా వేళ్లూనుకుంది. సోషల్ మీడియా వేర్వేరు రూపాలను సంతరించుకుంటోంది. ఇప్పుడు అదే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇ-కామర్స్ సెక్టార్‌లో కూడా యాహూ గ్రాండ్‌గా అడుగు పెట్టాలని భావిస్తోంది. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతను అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్.. జిమ్ ల్యాంజోన్ చేతిలో పెట్టింది.
ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకుని, సోషల్ మీడియా, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లల్లో యాహూను ఎలా టాప్ పొజీషన్‌కు జిమ్ ల్యాంజోన్ తీసుకుని వస్తాడనేది ఆసక్తి రేపుతోంది.. మార్కెట్‌లో పెద్ద ఎత్తున డిబేట్స్‌కు కారణమైంది. యాహూను అగ్రగామిగా నిలబెట్టడానికి తనవద్ద ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఉందని, దాన్ని అంతే పక్కాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తానని జిమ్ ల్యాంజోన్ తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications