తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకుంది. భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన బంగారం (gold) తో తయారు చేసిన నాణేలు ఆలయ ఖజానా నుంచి మాయమయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమాలు తాజాగా జరిగిన ఆడిట్ లో వెలుగుచూడటంతో ఆలయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసలేం జరిగింది?
యాదగిరిగుట్ట ఆలయంలో గత రెండు దశాబ్దాలుగా స్వామివారి ప్రతిమతో కూడిన బంగారం (gold) అలాగే వెండి నాణేలను భక్తులకు విక్రయిస్తున్నారు. వీటిని డాలర్లు అని పిలుస్తారు. భక్తులు సమర్పించే బంగారు కానుకలను సేకరించి, వాటిని ప్రభుత్వ మింట్ కు పంపి నాణేలుగా చేయిస్తారు. అయితే ఈసారి రికార్డుల్లో ఉన్న లెక్కలకు, స్టాక్ రూమ్ లో ఉన్న బంగారు నాణేలకు మధ్య భారీ తేడా కనిపించింది. దాదాపు రూ. 10 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ మాయమైనట్లు ప్రాథమిక అంచనాలో తేలింది.
పర్యవేక్షణ లోపమా? లేక భారీ కుంభకోణమా?
ఆలయ పబ్లిసిటీ విభాగం ఆధ్వర్యంలో ఈ నాణేల విక్రయాలు జరుగుతుంటాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండాల్సిన ఈ బంగారం స్టాక్.. రికార్డులకు దొరకకుండా ఎలా మాయమైంది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఇదే ఆలయం నుంచి చింతపండు బస్తాలు మాయమైనప్పుడు పెద్ద దుమారం రేగింది. కానీ, ఇప్పుడు ఏకంగా విలువైన బగారు నాణేలే గల్లంతు కావడం అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది.
కొత్త ఈఓ భవాని శంకర్ కఠిన హెచ్చరిక
ఈ వివాదం నడుస్తుండగానే, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గా భవాని శంకర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఈ బంగారు నాణేలు మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్నారు. "ఆడిట్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒక్క గ్రాము గోల్డ్ తక్కువగా ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీనికి బాధ్యులైన సిబ్బందిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.
భక్తుల ఆందోళన
స్వామివారికి భక్తితో సమర్పించిన కానుకలకు రక్షణ లేకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిపాలనలో రాజకీయ జోక్యం లేదా అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటి కుంభకోణాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి, స్వామివారి సొమ్మును రికవరీ చేయాలని కోరుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications