Multibagger Stock: గత రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ ఈ స్టాక్ మాత్రం తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్.. 'బిగ్ వేల్' ఆశిష్ కచోలియా కూడా పెట్టుబడి పెట్టారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది Xpro షేర్ గురించే. గత రెండేళ్ల కాలంలో ఈ స్టాక్ తన వాటాదారులకు అద్భుతమైన రాబడులను అందించింది. మార్కెట్ మాగ్నెట్ ఆశిష్ కచోలియా దాదాపుగా 4,21,616 Xpro ఇండియా షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీలో 3.57 శాతం వాటాకు సమానమని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాల్లో Xpro ఇండియా షేరు ధర దాదాపు రూ.31 నుంచి రూ.1030 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 3200 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ గత ఏడాదిలో 450 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించగా.. ఈ సమయంలో షేర్ మల్టీబ్యాగర్ గా మారింది.
ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.1670ను చేరుకున్న తర్వాత.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ప్రాఫిట్-బుకింగ్ ఒత్తిడిలోకి వెల్లింది. గత నెలలో ఇది దాదాపు 10 శాతం కరెక్షన్ కు గురైంది. అయితే.. ఇది YTD ప్రాతిపధికన దాదాపు రూ.937 నుంచి రూ.1030కి పెరిగింది. 2022లో దాదాపు 8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గడచిన ఏడాదిలో ఈ మల్టీబ్యాగర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియో స్టాక్ రూ.182 నుంచి రూ.1030 స్థాయిలకు పెరిగింది. అంటే దాదాపు 450 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదేవిధంగా.. గత రెండు సంవత్సరాల్లో ఈ స్టాక్ దాదాపు రూ.31 నుంచి రూ.1030కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 3200 శాతం రిటర్న్స్ అందించింది.

Xpro ఇండియా షేర్ ధర చరిత్రను గమనించినట్లయితే.. 2022 కొత్త సంవత్సరం ప్రారంభంలో ఒక పెట్టుబడిదారుడు ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని విలువ ప్రస్తుతం రూ.1.08 లక్షలకు చేరి ఉండేది. ఒక ఇన్వెస్టర్ సంవత్సరం క్రితం ఈ ఆశిష్ కచోలియా షేర్‌లో లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. దాని విలువ ప్రస్తుతం రూ.5.50 లక్షలకు చేరి ఉండేది. అదేవిధంగా.. ఒక ఇన్వెస్టర్ రెండేళ్ల క్రితం ఈ స్టాక్‌లో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని విలువ ప్రస్తుతం రూ.33 లక్షలుగా ఉండేది.
ఈ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియో స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.1228 కోట్లుగా ఉంది. దాని చివరి 20 రోజుల సగటు వాల్యూమ్ 12,361. కాబట్టి, ఇది తక్కువ-ఫ్లోట్ స్టాక్.. ఎన్ఎస్ఈలో దీని 52 వారాల గరిష్ఠం రూ.1670గా ఉండగా.. 52 వారాల కనిష్ఠం రూ.160గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications