Maldives: బుద్ధితెచ్చుకున్న మాల్దీవులు.. తిట్టిన మంత్రులే ఇప్పుడు రిక్వెస్ట్స్.. Xలో పోస్ట్ వైరల్
భారత ప్రజలు సహా ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవులకు చెందిన మంత్రులు చేసిన వ్యఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపాయి. దీంతో పూర్తిగా టూరిజంపై ఆధారపడి ఉన్న ఆ దేశానికి ఇండియన్స్ గట్టి షాక్ ఇచ్చారు. దేశాల మధ్య విబేధాలు ఎలా ఉన్నా, అక్కడి ప్రజలు మాత్రం భారత్ తమకు మంచి మిత్రదేశమని చెబుతూనే ఉన్నారు. కాగా తాజాగా Xలో వెలుగుచూతిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
మాల్దీవులతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు చెలరేగిన వేళ హసన్ కురుసీ అనే X (గతంలో ట్విట్టర్) ఖాతా నుంచి షేర్ చేసిన పలు ట్వీట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు దేశం దివాలా తీస్తున్నందున భారత్‌ను విమర్శించిన మాల్దీవుల మంత్రులు సహాయం అర్థిస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు.

అదే ఖాతా నుంచి షేర్ చేసిన మరో పోస్టులో.. మయిజ్జు అహంకారం వలన దేశం దివాళా స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. IMF ఆఫర్ చేసిన ఉద్దీపన ప్యాకేజీని తిరస్కరించినట్లు అందులో వెల్లడించారు. ఇండియా, పాకిస్తాన్, చైనా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు దయతో తమకు సాయం చేయాలంటూ మాల్దీవుల పబ్లిక్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్‌ను షేర్ చేశారు.
అయితే ఆ ఖాతా బయోలో తను ఓ కల్పిత పాత్ర అని, ఏ నిర్దిష్ట వ్యక్తికి ప్రాతినిధ్యం వహించడం లేదని పేర్కొంది. దీనిపై మండిపడిన అక్కడి క్రిమినల్ కోర్టు .. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లకు పేరుగాంచిన ఆ ట్విట్టర్ ఖాతాదారుని గుర్తించాలని ఆదేశించినట్లు మాల్దీవుల మీడియా సంస్తలు నివేదించాయి. మాల్దీవులు అయితే దివాళా తీసే స్థాయికి చేరుకోలేదని స్పష్టం చేశాయి.


Click it and Unblock the Notifications