ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్ల వల్ల ఆయా కంపెనీలు ఈ ఏడాది ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లేఆఫ్స్ ఇచ్చాయి. ఇక జీతాల పెంపుల్లోనూ భారీగా కోతలు విధించాయి. అయితే తాజాగా ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ, బ్రోకింగ్ మరియు సొల్యూషన్స్ కంపెనీ WTW ఇచ్చిన నివేదిక ఉద్యోగుల్లో కొత్త ఆశలను నింపుతోంది.
భారతీయ ఉద్యోగులు 2024లో గణనీయమైన జీతాల పెంపును పొందవచ్చని WTW నివేదిక పేర్కొంది. టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో భారీగా శాలరీ హైక్స్ ఉండబోతున్నాయని తెలిపింది. ఆర్థిక మాంద్యాన్ని సైతం లెక్కచేయకుండా ఇండియన్ కంపెనీస్ ఈ విషయంలో ముందడుగు వేయనున్నట్లు వెల్లడించింది.

ఇటీవల WTW రిలీజ్ చేసిన శాలరీ బడ్జెట్ ప్రణాళిక ప్రకారం.. 2024లో ఆయా భారతీయ కంపెనీలు తమ శ్రామిక శక్తికి సుమారు 9.8 శాతం మేర జీతాలను పెంచాలని చూస్తున్నాయి. ప్రతిభకు తీవ్రమైన పోటీ వాతావరణం కారణంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించడం మరియు రిటైన్ చేయడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అనేక భారతీయ కంపెనీలు సాంకేతికతంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పనిచేస్తాయి. ఇవి ఇతర సంస్థలకు పోటీ ఇచ్చేందుకు గణనీయమైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తాయి. ప్రభుత్వం కూడా వ్యాపార వృద్ధి, ఉద్యోగ కల్పన, ఆర్థిక పురోగతిని ప్రోత్సహించడానికి అనుగుణంగా చర్యలను ప్రవేశపెట్టడం వాటికి మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది.


Click it and Unblock the Notifications