WTO: కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై సుంకాలు విధించడం ద్వారా భారతదేశం పలు ఒప్పందాలను ఉల్లంఘించిందని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వివాదాల ప్యానెల్ తీర్పునిచ్చింది. పరిస్థితిని సరిదిద్దాలని ఇండియాకు సూచించింది. ఈ మేరకు 146 పేజీల పొడవైన తీర్పును వెలువరించింది.
అంతర్జాతీయ స్థాయిలో అంగీకరించిన దానికంటే ఈ విభాగం ఉత్పత్తులపై భారత్ ఎక్కువగా సుంకాలు విధించిందని ఆరోపిస్తూ.. 2019లో యూరోపియన్ యూనియన్ WTOను ఆశ్రయించింది. ఈ వివాదం తలెత్తడంతో తైవాన్, జపాన్ లు కూడా ఇండియాపై కేసు నమోదు చేశాయి. అయితే 1996లో సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందంలో ఏ అంశాలు చేర్చబడ్డాయి, 1997లో భారతదేశం చేరేటప్పుడు ఏవి ఉన్నాయి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

టెలిఫోన్, టెలివిజన్, రికార్డింగ్ ఉపకరణాలతో సహా కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక ఉత్పత్తుల గురించి సమస్య మొదలైంది. ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (WCO) చే అభివృద్ధి చేయబడిన హార్మోనైజ్డ్ సిస్టమ్ (HS)ని WTO సభ్య దేశాలు ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ దేశాల మధ్య వస్తువుల వర్గీకరణ HS వ్యవస్థతో ముడిపడింది. ఈ సిస్టమ్ కింద కొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తులను WCO క్రమం తప్పకుండా అప్ డేట్ చేస్తూ, ఈ డేటాను సభ్య దేశాలకు పంపిస్తుంది.
HS సమాచారాన్ని ఉపయోగించి ప్రతి సభ్య దేశం కొత్త షెడ్యూల్ ప్రకారం ట్రాన్స్ పోజ్ కావాల్సి ఉంటుంది. అయితే తమ సొంత పన్ను విధానాల్లో ఏవైనా మార్పులు చేసినట్లయితే వాటిపై WTO వద్ద చర్చలు జరపాలి. అందుకు అనుగుణంగా ఏళ్ల తరబడి పలుమార్లు ప్రపంచ వాణిజ్య సంస్థతో ఇండియా మాట్లాడింది. కానీ వివిధ కారణాల వల్ల భారత్ సూచించిన మార్పులు చేర్పునకు నోచుకోలేదు. చివరగా ఇప్పడు మన దేశం నిబంధనలు మీరి వ్యవహరిస్తోందని పేర్కొంది.
భారతదేశం కొన్ని వస్తువులపై మొదట అంగీకరించిన దానికంటే ఎక్కువ సుంకాన్ని విధిస్తోందని, ఇవి బేషరతుగా పన్ను రహితంగా ఉండాల్సిన టారిఫ్ లు అని ప్యానెల్ భావిస్తోంది. ఒకవేళ ఇండియా ఈ నిర్ణయంపై అప్పీల్ చేస్తే, కొంత కాలం పాటు ఈ విషయాన్ని పక్కకు పెట్టేయవచ్చు. ఎందుకంటే 2019 నుంచి WTO అప్పీళ్ల బెంచ్ కు నియామకాలను అమెరికా అడ్డుకుంటూ వస్తోంది. 2024 చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబటాలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అగ్రరాజ్యం ఇటీవల వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications