UPI Reversal: భారత పేమెంట్స్ సిస్టమ్ దినదినాభివృద్ధి చెందుతూ సరిహద్దులు దాటి దూసుకుపోతోంది. ఇరుగుపొరుగు దేశాలతో పాటు UAE, ఫ్రాన్స్ వంటి ప్రాంతాల్లోనూ సత్తా చాటుతోంది. టెక్నాలజీ బాగానే ఉన్నా, మానవ తప్పిదాల వల్ల ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకరికి చెల్లించాల్సిన నగదు అనుకోకుండా వేరొకరికి క్రెడిట్ అయితే ఎలా స్పందించాలి అనేది చాలా మందికి తెలియదు.
UPI ద్వారా పేమెంట్స్ చేసే సమయలో వినియోగదారులు తప్పుగా మరో వ్యక్తికి నగదు బదిలీ చేసే ప్రమాదం ఉంది. ఆ పరస్థితుల్లో దిగులు పడాల్సిన పనిలేదు. ఈ తరహా లావాదేవీలను రివర్స్ చేయవచ్చు. దీంతో సదరు వినియోగదారుల డబ్బు ఎక్కడికీ పోదు, తిరిగి అకౌంట్‌కి వచ్చి చేరుతుంది. అయితే ఇందుకోసం ఓ ప్రక్రియను ఫాలో కావాల్సి ఉంటుంది.

తప్పు లావాదేవీకి సంబంధించి పరిహారం పొందేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. npci.org.inని సందర్శించి 'డిస్ప్యూట్ రిడ్రసల్ మెకానిజమ్' విభాగానికి వెళ్లాలి. అక్కడ 'కంప్లైంట్' ట్యాబ్ ఎంచుకుని అవసరమైన వివరాలను నమోదే చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం UPI లావాదేవీ ID, వర్చువల్ పేమెంట్ అడ్రస్, బదిలీ అమౌంట్, లావాదేవీ తేదీ, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్ వీటితో పాటు కట్ అయిన మొత్తాన్ని చూపుతూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా అప్‌లోడ్ చేయాలి.
NPCI వెబ్‌సైట్ ప్రకారం మొదటి దశలో సదరు UPI లావాదేవీ జరిపబడిన పేటీఎం వంటి TPAPకు ఫిర్యాదు పంపబడుతుంది. అక్కడ పరిష్కారం దొరకని పక్షంలో సంబంధిత PSP బ్యాంక్ దాన్ని పంపిస్తుంది. తదుపరి స్థాయిలో NPCI విచారణ జరుపుతుంది. ఇక చివరి దశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీనంలోని బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications