WPI Inflation: అనేక నెలలుగా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, ప్రభుత్వాలను ద్రవ్యోల్బణం ఆందోళనకు గురిచేస్తోంది. దీనిని అదుపుచేసేందుకు సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా వడ్డీ రేట్లను పెంచాయి.
సెంట్రల్ బ్యాంకుల కఠిన మానిటరీ చర్యలు ప్రస్తుతం ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మే 2023కు సంబంధించిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(WPI) 3.48 శాతం తగ్గిందని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది ఏప్రిల్ నెలలో స్వల్పంగా 0.98 శాతం మాత్రమే తగ్గింది.

మే 2023లో ద్రవ్యోల్బణం రేటు తగ్గుదలకు ప్రధానంగా ఖనిజ నూనెలు, ప్రాథమిక లోహాలు, ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, ఆహారేతర వస్తువులు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, రసాయన & రసాయన ఉత్పత్తుల ధరలు తగ్గడం ద్రవ్యోల్బణం రేటు తగ్గుదలకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. మే నెలలో ఆహార సూచీ ద్రవ్యోల్బణం 1.59 శాతం తగ్గింది.
మే నెలలో ఇంధనం & విద్యుత్ ద్రవ్యోల్బణం 9.17 శాతం తగ్గగా.. డబ్ల్యుపీఐలో ప్రధాన భాగాన్ని కలిగి ఉన్న ఉత్పాదక ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.42 శాతం క్షీణతకు వ్యతిరేకంగా 2.97 శాతం క్షీణించింది. దేశంలో రిటైల్(CPI) ద్రవ్యోల్బణం కూడా మే నెలలో మరింతగా తగ్గుముఖం పట్టి గత నెలలో 4.7 శాతం నుంచి రెండేళ్ల కనిష్ఠానికి 4.25 శాతానికి చేరుకుంది. రిజర్వు బ్యాంక్ కూడా FY24 ద్రవ్యోల్బణం అంచనాను తగ్గించింది. CPI ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడు త్రైమాసికాల్లో 2-6 శాతం మధ్య పరిమితిలో ఉంది.


Click it and Unblock the Notifications