WPI inflation: ఆల్‌టైమ్ గరిష్టానికి ద్రవ్యోల్భణం, ఏప్రిల్‌లో 15.08 శాతానికి జంప్

నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలో హోల్ సేల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్భణం (WPI) ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో నమోదయింది. ఏప్రిల్ నెలలో WPI ద్రవ్యోల్భణం 15.08 శాతానికి చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతక్రితం మార్చి నెలలో హోల్ సేల్ ద్రవ్యోల్భణం 14.55 శాతంగా ఉండగా, గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇది 10.74 శాతంగా నమోదయింది.

హోల్ సేల్ ద్రవ్యోల్భణం రెండంకెల్లో నమోదు కావడం వరుసగా ఇది పదమూడోసారి. ద్రవ్యోల్భణం ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి. అంతకుముందు 2021 నవంబర్ నెలలో 14.87 శాతంగా నమోదయింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి ఏకంగా 15 శాతం క్రాస్ చేసింది. ఏప్రిల్ నెలలో చమురు ధరలతో పాటు ఆహార, ఆహారేతర పదార్థాలు, రసాయనాలు ఇలా అనేక వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్భణం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.

WPI inflation at record high of 15.08 percent in April

ఏప్రిల్ నెలలో కూరగాయలు, గోధుమలు, పండ్ల ధరలు పెరిగాయి. దీంతో ఆహార ద్రవ్యోల్భణం 8.35 శాతానికి చేరుకుంది. వినియోగదారుల సీచు ఆధారిత (CPI) రిటైల్ ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 8 నెలల గరిష్టానికి చేరుకుంది. గత నెలలో ఇది 7.79 శాతంగా నమోదయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2014 మే నెలలో రికార్డ్ స్థాయిలో 8.33 శాతంగా నమోదయింది. ఆ తర్వాత అదే స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్భణం నమోదు కావడం ఇదే తొలిసారి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+