ముంబై: బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూడటంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. దీంతో ఆసియా, భారత మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజే రూ.6.59 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో 30 షేర్లు 1,406.73 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ 13,350 దిగువకు చేరుకుంది. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,59,313 క్షీణించి రూ.1,78,79,323 కోట్లకు పడిపోయింది. ఆసియా మార్కెట్లో హాంగ్‌కాంగ్, టోక్యో నష్టపోగా, షాంఘై, సియోల్ పెరిగాయి. ఐరోపో స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

చిన్న షేర్లు డౌన్
ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 46,932 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించింది. ఇంట్రాడేలో 47,055 మార్క్‌ను దాటింది. అయితే కాసేపట్లోనే అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో 2000 పాయింట్ల నష్టంలోకి వెళ్లింది. 44,923 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 45,554 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 432 పాయింట్లు పతనమై 13,328 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో 13,131 వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 30లో అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో 2472 షేర్లు నష్టాల్లో, 564 షేర్లు లాభాల్లో ముగియగా, 156 షేర్లలో మార్పులేదు. బ్లూచిప్‌లతో పోలిస్తే చిన్న, మధ్యస్థాయి కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎక్కువగా ఎధుర్కొన్నాయి. స్మాల్ క్యాప్ 4.57 శాతం, మిడ్ క్యాప్ 4.14 శాతం నష్టపోయాయి.

ఈ 5 కంపెనీలకే రూ.2 లక్షల కోట్ల నష్టం
గత 11 సెషన్లుగా మార్కెట్లు లాభాల్లో ఉండగా, ఒక్కరోజులో అవన్నీ గాల్లో కలిశాయి. ఏడు నెలల కాలంలో సెన్సెక్స్స్ భారీ పతనం ఇదే. మే తర్వాత మళ్లీ మార్కెట్లు వరస్ట్‌గా ముగిశాయి. మార్కెట్లో ఎక్కువగా నష్టపోయిన 5 కంపెనీల షేర్ల కారణంగా వాటి మార్కెట్ క్యాప్ రూ.1.95 లక్షల కోట్లు తుిచి పెట్టుకుపోయింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.13.47 లక్షల కోట్ల నుండి రూ.12.26 లక్షల కోట్లకు తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.18,000 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.16,000 కోట్లు, ఐటీసీ ఎం-క్యాప్ రూ.18,000 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ.15,000 కోట్ల చొప్పున తగ్గింది. నిన్న నిమిషానికి రూ.1850 కోట్ల నష్టం వాటిల్లింది.

కొన్ని మాత్రం..
500 షేర్ల వరకు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. స్పైస్ జెట్, గ్రాఫైట్ ఇండియా, టాటా స్టీల్ వంటి షేర్లు ఉన్నాయి. మార్కెట్ భారీగా పతనమైనప్పటికీ బిర్లా సాఫ్ట్, క్యాడిల్లా హెల్త్ కేర్, హెచ్ఐఎల్ వంటి కొన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఇక, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ సూచీలు మూడు శాతం వరకు నష్టంతో ముగిశాయి. ఆసియాలో జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ ఈక్విటీ సూచీలు ఒక శాతం నుండి 5 శాతం వరకు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్, ఎస్ అండ్ పీ, డీ జోన్స్ 0.6 శాతం నుండి 0.7 శాతం వరకు నష్టపోయాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications