ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కేవలం సంపదలోనే కాదు, దాతృత్వ కార్యకలాపాల్లోను ముందున్నారు. 2020 ఏడాదిలో చారిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన వారిలో బెజోస్ ముందున్నారు. గత ఏడాది వాతావరణ మార్పులపై పోరాటం కోసం 10 బిలియన్ డాలర్లు డొనేట్ చేశారు. 2020లో అతిపెద్ద డొనేేషన్ ఇది. క్రానికకల్ ఆఫ్ ఫిలాంత్రఫీస్ యాన్యువల్ లిస్ట్ ప్రకారం పోయిన సంవత్సరం బెజోస్ టాప్‌లో నిలిచారు.

బెజోస్ ఎర్త్ ఫండ్
జెఫ్ బెజోస్ నికర ఆదాయం దాదాపు 188 బిలియన్ డాలర్లు. బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా అతను పెద్ద మొత్తంలో డొనేట్ చేస్తున్నారు. వాతావరణ సంక్షోభంలో చిక్కుకున్న లాభాపేక్షలేని సంస్థలకు బెజోస్ ఎర్త్ ఫండ్ మద్దతు ఇస్తోంది. ఎర్త్ ఫండ్ ద్వారా ఆయన ఇప్పటి వరకు 16 గ్రూప్స్‌కు 790 మిలియన్ డాలర్ల సహకారం అందించినట్లు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీస్ తెలిపింది. బెజోస్‌ను మినహాయిస్తే టాప్ 10 వితరణలు 2011తో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం వితరణ 2.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ బిలియనీర్ల సంపద గత ఏడాది భారిగా పెరిగినప్పటికీ, విరాళాలు తగ్గాయని తెలిపింది. 2020 మార్చి 18 నుండి డిసెంబర్ 7 వరకు బెజోస్ సంపద 60 శాతం పెరిగింది.

రెండు, మూడో స్థానంలో భార్యాభర్తలు
వితరణలో బెజోస్ తర్వాత ఫిల్ నైట్, అతని భార్య ఉన్నారు. వీరిద్దరు రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఫిల్ నైట్ ఆదాయం గత ఏడాది మార్చి నుండి డిసెంబర్ మధ్య కాలంలో 77 శాతం పెరిగింది. నైట్, అతని భార్య 900 మిలియన్ డాలర్ల మేర దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించారు. దాతృత్వ కార్యకలాపాల కోసం నైట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఓరెగాన్ కోసం 300 మిలియన్ డాలర్లు ఇచ్చారు.

జుకర్ బర్గ్ 250 మిలియన్ డాలర్లు...
ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి 250 మిలియన్ డాలర్లు ఇచ్చారు. HBE కార్పోరేషన్ కంపెనీ ఫౌండర్ ఫ్రెడ్ కుమ్మర్, అతని భార్య 300 మిలియన్ డాలర్లు దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications