Bitcoin Crash: భారీగా పతనమైన బిట్‌కాయిన్.. ఇండియాకి బినాన్స్ తిరిగి ఎంట్రీ..
Crypto Currency: చాలా కాలం తర్వాత కొన్ని నెలల కిందట ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర 60 వేల డాలర్ల మార్కును అధిగమించింది. అయితే నేడు మెగా క్రాష్ నమోదు కావటం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లో క్షీణత బుధవారం కూడా కొనసాగింది. నేడు 3.84 శాతం కంటే ఎక్కువ తగ్గి 61,309 డాలర్లకు చేరుకుంది. గత ఐదు రోజుల్లో బిట్‌కాయిన్ ఏకంగా 8.81 శాతం క్షీణతను చూడగా.. గత నెలలో 10.31 శాతానికి పైగా పడిపోయింది. గడచిన 24 గంటలంలో గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ 4.1% క్షీణతకు లోనైంది. బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 1.239 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం బిట్‌కాయిన్ ఆధిపత్యం 54.11% వద్ద ఉందని సూచించింది.

డ్రోన్లు-క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రాంతీయ సంఘర్షణను తీవ్రతరం చేస్తుందనే భయాన్ని పెంచింది. బిట్‌కాయిన్ చాలా క్రిప్టోలను అధిగమిస్తున్నందున ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడంతో బిట్‌కాయిన్ 60,000 డాలర్ల మార్క్ వద్ద బలమైన మద్దతును ఏర్పరుస్తుందని కాయిన్‌స్విచ్ మార్కెట్స్ డెస్క్ పేర్కొంది.
క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లోని పెట్టుబడిదారులు రాబోయే బిట్‌కాయిన్ హాల్వింగ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 20 నాటికి, టోకెన్ల కోసం కొత్త దరఖాస్తులు సగానికి తగ్గించబడతాయి. ఇటీవల బిట్‌కాయిన్ దాని చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుందని మీకు తెలియజేద్దాం. క్షీణతకు ఇతర ప్రధాన కారణాలను గమనిస్తే.. మార్చిలో ఊహించిన US రిటైల్ అమ్మకాల డేటాతో క్రిప్టోకరెన్సీ బలంగా ప్రభావితమైంది. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లను ఈ ఏడాది తగ్గించాలని చూస్తున్నట్లు పావెల్ ప్రకటన సైతం క్రిప్టోల్లో అలజడికి కారణమైంది.
కొన్ని రోజుల క్రితం హాంకాంగ్.. బిట్‌కాయిన్, ఈథర్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ కోసం షరతులతో కూడిన ఆమోదం ఇచ్చింది. చైనాలో క్రిప్టోకరెన్సీలపై నిషేధం ఉన్నప్పటికీ.. హాంకాంగ్ గ్లోబల్ డిజిటల్ అసెట్ సెంటర్‌గా చురుకుగా స్థానం పొందుతోంది. అయితే భారత ప్రభుత్వం క్రిప్టోలను అణచివేస్తోంది. వీటిలో పెట్టుబడులు భారీ నష్టాలకు సైతం దారితీస్తాయి. అందువల్ల దేశీయ పెట్టుబడిదారులు వీటికి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. ఇదే క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ బినాన్స్ 2 మిలియన్ డాలర్లు చెల్లించిన తర్వాత తిరిగి భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది.


Click it and Unblock the Notifications