మనీ అనే కాన్సెప్ట్ ఇక క్లోజ్.. రోబోలు, ఏఐ ప్రపంచంపై ఎలన్ మస్క్ షాకింగ్ ప్రిడిక్షన్!

ప్రపంచవ్యాప్తంగా అసాధ్యం అనుకున్న విషయాలను సాధ్యం చేసి చూపించడం బిలియనీర్ Elon Musk కు ఒక అలవాటు. తాజాగా ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వారంలోనే ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీ షేర్ మార్కెట్లోకి వచ్చి.. ఏకంగా 75 బిలియన్ డాలర్ల మెగా ఐపీఓ (IPO) ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ. ఈ దెబ్బతో ఎలన్ మస్క్ నికర ఆస్తి విలువ ఏకంగా 1.1 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 91 లక్షల కోట్లు) చేరింది. తద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారు.

Worlds 1st trillionaire Elon Musk says a quadrillion dollar fortune not impossible but theres a catch

క్వాడ్రిలియనీర్ అంటే ఏంటి? మస్క్ సమాధానం ఏంటి?

ప్రస్తుతం మస్క్ ఆస్తి ప్రపంచంలోనే రెండో ధనికుడైన లారీ పేజ్ (300 బిలియన్ డాలర్లు) కంటే ఎంతో ఎత్తులో ఉంది. అయితే, సోషల్ మీడియా వేదిక 'X' లో ఒక అకౌంట్.. "మస్క్ క్వాడ్రిలియనీర్ అవ్వాలంటే మరో 998.9 ట్రిలియన్ డాలర్లు కావాలి" అని పోస్ట్ చేసింది. క్వాడ్రిలియనీర్ అంటే వెయ్యి ట్రిలియన్ డాలర్లు అన్నమాట. ప్రస్తుతం ప్రపంచం మొత్తం జీడీపీనే కేవలం 120 ట్రిలియన్ డాలర్లు. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల సంపదను కలిపినా.. దానికి 8 రెట్లు ఎక్కువ ఆస్తి అన్నమాట. దీనిపై Elon Musk స్పందిస్తూ.. అది అసాధ్యమేమీ కాదని, కానీ దానికి ఒక కండిషన్ ఉందని ట్వీట్ చేశారు.

చంద్రుడు, అంగారకుడిపై ఫ్యాక్టరీలు!

మస్క్ లెక్క ప్రకారం.. క్వాడ్రిలియనీర్ కావాలంటే భూమిపై ఉన్న సంపద సరిపోదు. "దీనికోసం చంద్రుడిపై (Moon), మార్స్ (Mars) గ్రహంపై ఫ్యాక్టరీలు కట్టాలి" అని ఆయన సమాధానమిచ్చారు. స్పేస్‌ఎక్స్ సంస్థ తయారు చేస్తున్న స్టార్‌షిప్ రాకెట్ ఉద్దేశం కూడా ఇదే. అంగారక గ్రహంపై మానవ కాలనీలను ఏర్పాటు చేసి, అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులను, వనరులను భూమికి సరఫరా చేయడం లేదా అంతర గ్రహ వాణిజ్యం (Interplanetary Commerce) నడపడం ద్వారా ఈ స్థాయి సంపదను సృష్టించవచ్చని మస్క్ భావిస్తున్నారు.

భవిష్యత్తులో డబ్బు ఉండదు.. కేవలం మాస్ అండ్ ఎనర్జీ మాత్రమే!

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. క్వాడ్రిలియనీర్ స్థాయికి వెళ్లేసరికి ప్రపంచంలో అసలు యూఎస్ డాలర్ లాంటి కరెన్సీలే ఉండవని మస్క్ అభిప్రాయపడ్డారు. "ఆ కాలంలో డబ్బుకు విలువ ఉండదు.. కేవలం మాస్ (ద్రవ్యరాశి), ఎనర్జీ (శక్తి) మాత్రమే కరెన్సీగా మారతాయి" అని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేస్తాయని, వస్తువుల ఉత్పత్తి ఖర్చు దాదాపు జీరోకి పడిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు.

ఆటోమేషన్ వల్ల డబ్బు అనే కాన్సెప్ట్ కాలగర్భంలో కలిసిపోతుందని, మనుషులందరికీ ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకే అన్ని సేవలు అందుతాయని మస్క్ గతంలోనే చెప్పారు. దక్షిణ ఆఫ్రికాలో పుట్టి, టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, బోర్లింగ్ కంపెనీలతో ప్రపంచాన్ని మార్చేసిన మస్క్.. 2022లో ట్విట్టర్‌ను కొని 'X' గా మార్చారు. ప్రస్తుతం ఆయన సంపదలో సింహభాగం (866 బిలియన్ డాలర్లు) స్పేస్‌ఎక్స్ నుంచే రావడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+