శతాబ్దాలుగా బంగారం మానవ సమాజానికి ఆర్థిక బలం, సామాజిక గౌరవం, భద్రతకు ప్రతీకగా నిలుస్తూ వస్తోంది. బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాకుండా శక్తి, ప్రతిష్ట, సంపదకు ప్రతిరూపంగా నిలుస్తోంది. భారతదేశం వంటి ఆసియా దేశాలలో బంగారం అనేది పెళ్లిళ్లు, పండుగలు, ధార్మిక వేడుకలలో తప్పనిసరిగా ఉండే సంప్రదాయం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు భారత్‌లో కాకుండా చాలా తక్కువ జనాభా ఉండే ఇతర దేశాల్లో ఉన్నాయని కొత్త నివేదికలు చెబుతున్నాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,44,000 మెట్రిక్ టన్నుల బంగారం కనుగొనబడింది. వీటిలో 1,87,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే బయటకు వెలికితీసారు. అయితే ఇంకా 57 వేల మెట్రిక్ టన్నులు భూగర్భంలో మిగిలి ఉన్నాయని అంచనా. ఈ భూగర్భ బంగారంలో పెద్దభాగం కొన్ని ముఖ్యమైన దేశాల నేల కిందే దాగి ఉంది. వీటిలో చైనా, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా ప్రధానమైనవి.

అయితే అతి చిన్న దేశం ఆస్ట్రేలియా ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశంగా నిలిచింది. దాదాపు 12 వేల మెట్రిక్ టన్నులు భూగర్భ బంగారం ఆ దేశంలో ఉన్నట్లు అంచనా. ఈ నిల్వల విలువ సుమారు 720 బిలియన్ అమెరికన్ డాలర్లు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని కల్గూర్లీ, న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాలు ప్రధాన బంగారు గనుల కేంద్రాలుగా ఉన్నాయి.
రష్యా కూడా దాదాపు 12 వేల మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలతో రెండో స్థానంలో ఉంది. సైబీరియా, మాగడాన్, క్రాస్నోయార్స్క్ ప్రాంతాలు బంగారం తవ్వకాల ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. రష్యా తన బంగారం నిల్వలను డాలర్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకునే వ్యూహం పాటిస్తోంది.
అలాగే దక్షిణాఫ్రికా 19వ శతాబ్దం నుంచి బంగారం ఉత్పత్తిలో ప్రపంచానికి నాయకత్వం వహించింది. ఇప్పటికీ సుమారు 3,200 మెట్రిక్ టన్నుల భూగర్భ బంగారం ఉన్నట్లు భావిస్తున్నారు. జొహన్నెస్‌బర్గ్ చుట్టుపక్కల ఉన్న "గోల్డ్ రీఫ్" ప్రాంతం ప్రసిద్ధ Gold గని క్షేత్రంగా ఉంది.
యునైటెడ్ స్టేట్స్ దాదాపు 3 వేల మెట్రిక్ టన్నుల Gold నిల్వలతో నాల్గవ స్థానంలో ఉంది. నెవాడా రాష్ట్రం అమెరికా బంగారు ఉత్పత్తిలో సుమారు 75 శాతం వాటా కలిగి ఉంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు కూడా బంగారాన్ని రిజర్వ్ ఆస్తిగా ఉంచి ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తోంది.
ఇక ఇండోనేషియా 3,600 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలతో మొదటి ఐదు దేశాలలో స్థానం సంపాదించింది. గ్రాస్‌బర్గ్ మైన్ (Grasberg Mine) ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు, రాగి గనులలో ఒకటిగా ఉంది.
ప్రపంచ బంగారం భూగర్భ నిల్వలలో ఈ ఐదు దేశాలు దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశం బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలలో ఒకటైనా, భూగర్భ నిల్వల పరంగా ఈ జాబితాలో లేదు. ఇది బంగారంపై మన సాంస్కృతిక ఆసక్తి ఎక్కువైనా, సహజ వనరుల పరంగా మాత్రం మిగిలిన ప్రపంచం.. బంగారాన్ని ఆధిపత్యం చెలాయిస్తున్నదనే విషయం స్పష్టంగా చూపిస్తుంది.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications