ఎవరైనా భూగర్భంలోకి లిఫ్ట్‌లో గంటసేపు వెళితే ఎలా ఉంటుందో ఊహించారా.. చాలామంది కొంచెం లోపలకి వెళ్లగానే భయంతో వణికిపోతారు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసినా లోపలంతా చీకటిగా ఉండి ఏమి కానరాక బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తుంటారు చాలామంది. అయితే దక్షిణాఫ్రికాలోని మ్పోనెంగ్‌లోని మైనర్లకు ఇది రోజువారీ జీవితంగా ఉందంటే నమ్మగలరా.
అవును వీరు ప్రపంచంలోనే అత్యంత లోతైన బంగారు గని.. భూగర్భంలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని దగ్గరకు ప్రతి రోజూ వెళుతుంటారు. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కంటే ఐదు రెట్లు లోతుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ గని గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా అనేక బంగారు గనులు ఉన్నప్పటికీ.. వాటిలో అత్యధిక భాగం ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశం లోతైన భూగర్భ గనులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గనులు కేవలం బంగారమే కాకుండా, మైనింగ్ సాంకేతికతలో మానవ సామర్థ్యాన్ని, ధైర్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. భూమి లోతుల్లోకి వెళ్లి, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ప్రమాదాల మధ్య పనిచేసే గనికారులు ప్రపంచానికి అపారమైన సంపదను అందిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలోని టౌటోనా గని ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన గనిగా గుర్తింపు పొందింది. సుమారు 3.9 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించిన ఈ Gold Mine, 2018లో మూసివేయబడే వరకు దశాబ్దాలపాటు లక్షల ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. వేలాది మంది కార్మికులు ఇందులో పని చేయడం ద్వారా ఈ గని ఒక సంపూర్ణ భూగర్భ నగరంలా మారింది. అలాగే సవుకా బంగారు గని కూడా దక్షిణాఫ్రికాలోనే ఉండి.. సుమారు 3.7 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించింది. ఈ గని లోతైన పనులకే ప్రసిద్ధి, భారీ పరిమాణంలో బంగారు ఖనిజం ఇక్కడ లభిస్తుందని చరిత్ర చెబుతోంది.
డ్రైఫోంటెయిన్ గని 3.42 కిలోమీటర్ల లోతుతో ఇప్పటికీ చురుకుగా పనిచేస్తున్న గనుల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే క్లూఫ్ గని సుమారు 3.35 కిలోమీటర్ల లోతులో ఉండి.. బంగారంతో పాటు యురేనియంను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆధునిక మైనింగ్ పద్ధతులతో ఈ గనులు లోతుల్లో కూడా సమర్థవంతంగా పని చేస్తున్నాయి. ఆఫ్రికా వెలుపల చూస్తే, కెనడాలోని లారోండే గని సుమారు 3.26 కిలోమీటర్ల లోతుతో అక్కడి అత్యంత లోతైన గనిగా నిలిచింది.
అయితే ప్రపంచంలోనే అత్యంత లోతైన బంగారు గని అనే బిరుదు దక్షిణాఫ్రికాలోని మ్పోనెంగ్ గనికే దక్కుతుంది. ఇది దాదాపు 4 కిలోమీటర్ల లోతుకు చేరుకుంటుంది. గనికారులు తమ పని ప్రదేశానికి చేరుకోవడానికి సుమారు మూడు గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ లోతుల్లో రాతి ఉష్ణోగ్రతలు 150 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి. అందుకే శక్తివంతమైన శీతలీకరణ వ్యవస్థలు లేకుండా అక్కడ పని చేయడం అసాధ్యం. తీవ్రమైన ప్రమాదాలు, చిన్న పొరపాటుతోనే ప్రాణనష్టం సంభవించే పరిస్థితులు ఈ గనిలో సాధారణమే.
అన్ని సవాళ్ల మధ్య కూడా మ్పోనెంగ్ గని ఏటా సుమారు 8 వేల కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచ బంగారు సరఫరాలో ఒక కీలక భాగంగా నిలుస్తుంది. భూమి లోతుల్లో మానవ ధైర్యం, సాంకేతిక నైపుణ్యం కలసి సృష్టించిన ఈ గనులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటివిగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications