స్నాక్స్, శీతల పానీయల కంపెనీ పెప్సీకో కూడా ట్విట్టర్, మెటా, అమెజాన్ బాట పట్టింది. తమ సంస్థలోని ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మొదలు పెట్టినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. పెప్సీకో ఉత్తర అమెరికా చిరుతిండి, శీతల పానీయాల యూనిట్ల నుంచి ప్రధాన కార్యాలయ ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ మేరకు పెప్సీకో అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

309,000 మంది ఉద్యోగులు
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో ప్రపంచ వ్యాప్తంగా పెప్సీకోలో పని చేస్తున్న కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పెప్సికో పెప్సి కోలా డ్రింక్‌తో పాటు డోరిటోస్, లేస్ చిప్స్ , క్వేకర్ ఓట్స్‌ని తయారు చేస్తుంది. పెప్సీకోలో ప్రపంచవ్యాప్తంగా 309,000 మంది ఉద్యోగులున్నారట. వీరిలో 40శాతానికి మంచి అమెరికాలోనే ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ద్వారా ఇప్పటికే స్నాక్స్ యూనిట్లో ఉద్యోగాల కోత నేపథ్యంలో ఇక పానీయాల వ్యాపారంలో కోతలు భారీగా ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.

ఖర్చులు తగ్గించుకోవాలని
ఈ వార్తలపై పెప్సీకో కంపెనీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అయితే ఈ కథనం తర్వాత ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 0.1% పెరిగాయి. చక్కెర, మొక్కజొన్న, బంగాళాదుంపల వంటి వస్తువులకు ఎక్కువ చెల్లించి, ప్రొడక్టులను అధిక ధరలను వినియోగదారులకు అందజేస్తున్నప్పటికీ కంపెనీ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేపోతున్నట్లు తెలిసింది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఐటీలోనే కాకుండా మీడియా కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నారు.

అమెజాన్
ఇ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 10,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీనికి రెట్టింపు సంఖ్యలో పింక్ స్లిప్ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ దెబ్బతో రానున్న రోజుల్లో అమెజాన్ ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలగించే ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు జారీచేయడంతో పరిహార ప్యాకేజ్‌ను సెటిల్ చేయను


Click it and Unblock the Notifications