Indian Economy: ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకుపోతున్న భారత్ పై అనేక అంచనాలు ఉన్నాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ఆశయంతో వేగంగా ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో ఏకంగా అగ్రరాజ్యం అమెరికాను సైతం వెనక్కి నెట్టాలని ఎన్నో కలలు కంటోంది. ఇదే రేంజ్ లో భారత్ మరి కొంతకాలం వృద్ధిని కొనసాగిస్తే అదేమంత పెద్ద కష్టం కాబోదని కొందరు విశ్లేషకుల వాదన.
భారత్ ఆశలకు గండి కొడుతూ ప్రపంచ బ్యాంకు కీలక నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో భారత్ 'బ్రైట్ స్పాట్' అంటూ కీర్తించిన ఈ అంతర్జాతీయ సంస్థే ఇండియాకు అంత సీన్ లేదని తేల్చి చెప్పింది. రాబోయే రోజుల్లో ఇండియా తోపాటు దాదాపు 100కు పైగా దేశాలు ఆదాయాన్ని పెంచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికా తలసరి ఆదాయంలో ఓ త్రైమాసికాన్ని టచ్ చేయాలన్నా భారత్కు 75 ఏళ్లు పట్టవచ్చని అంచనా వేసింది.

వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ పేరిట రిలీజ్ చేసిన ఈ నివేదికలో ప్రపంచ బ్యాంక్ మరిన్ని విస్తు పోయే విషయాలు తెలిపింది అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతు సాధించాలంటే చైనా 10 ఏళ్లు, ఇండోనేషియాకి 70 ఏళ్లు వేచిచూడాలని పేర్కొంది. 100కు పైగా దేశాలను గతేడాది మిడిల్ ఇన్‌కం కంట్రీస్ గా గుర్తించారు. వీటిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నట్లు తేల్చారు. అయితే ఈ జాబితాలో భారత్ కూడా ఉండటం విశేషం.
ఈ జాబితాలోని 108 దేశాల్లో 600కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ప్రపంచ పాపులేషన్ లో 75 శాతం వాటా వీటి సొంతం. కాగా 1990 నుంచి ఇప్పటివరకు కేవలం 34 దేశాలే తమ ఆదాయాన్ని వృద్ధి పరుచుకున్నట్లు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెబుతోంది. ఆశావహ దృక్పథంతో ఉన్న భారతీయుల ఆశలపై ప్రపంచ బ్యాంక్ నీళ్లు చల్లినట్లు అయ్యింది అయితే ఈ రిపోర్టు సరి కాదంటూ దాన్ని తప్పు పట్టేవారు ఉన్నారు. ముఖ్యంగా భారత్ విషయంలో చేసిన కామెంట్స్‌తో వరల్డ్ బ్యాంక్ విమర్శలు మూటగట్టుకుంటోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications