భారత GDP వృద్ధిపై ప్రపంచ బ్యాంక్ కోత.. ఇవీ FY24 అంచనాలు
GDP: ప్రస్తుత మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటూ మంచి వృద్ధితో ముందుకు సాగుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇండియా మాత్రమే. ప్రపంచ ఆర్థికంలో ఓ బ్రైట్ స్పాట్ గా పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు భారత్ ను ప్రశంసలతో ముంచెత్తిన సంగతులు విన్నాం. అయితే FY24లో దేశ GDP వృద్ధిపై తన అంచనాలను ప్రపంచ బ్యాంకు సవరించింది.
భారతదేశ GDP వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. అదే సమయంలో ప్రపంచ వృద్ధి పట్ల సానుకూల దృక్పథాన్ని కనబరిచింది. తాజా గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం.. జనవరిలో ప్రకటించిన మునుపటి అంచనా 6.6 శాతతో పోలిస్తే FY24లో ఇండియా GDP వృద్ధి కొద్దిగా మందగించి 6.3 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది.

అధిక ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న రుణాల ఖర్చులు GDP వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింంది. అయితే ఇప్పుడిప్పుడే ద్రవ్యోల్బణం గాడిలో పడటం, ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా FY26 నాటికి వృద్ధి స్వల్పంగా మెరుగుపడుతుందని నివేదిక వెల్లడించింది. తలసరి GDP వృద్ధి పరంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలుపుకోగలదని అంచనా వేసింది.
గతేడాది 3.1 శాతం వృద్ధి అనంతరం 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మందగమనాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేయబడింది. ఈ సమయంలో వృద్ధి అంచనా 2.1 శాతం మాత్రమే. అధిక ద్రవ్యోల్బణ రేట్లను అరికట్టే లక్ష్యంతో కొనసాగుతున్న ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ప్రపంచ వృద్ధి రికవరీ అంచనాలు జనవరిలో 1.7 శాతం కాగా.. ప్రస్తుత అంచనాలు ప్రపంచ వృద్ధిని 2.4 శాతం వద్దకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications