World Bank: పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను డిజిటలైజ్ చేయడంలో భారత్ ఎంతో పురోగతిని సాధించింది. కరెన్సీ లేకుండా చెల్లింపులు చేయలేని పరిస్థితి నుంచి UPI ద్వారా క్షణాల్లో లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసే స్థాయికి ఎదిగింది. ఈ అభివృద్ధిని చూసి ప్రపంచ అగ్రదేశాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.
ప్రధాని మోదీ హయాంలో దశాబ్ద కాలంగా భారత్ లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(DPI) ఎంతో పురోగతి సాధించింది అంటూ ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. 'డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా: G20 గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్' పేరిట ఈ మేరకు ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది.

DPI ల్యాండ్ స్కేప్ రూపొందించడంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానం, నియంత్రణ సిస్టమ్ ను ఈ డాక్యుమెంట్ లో ప్రపంచ బ్యాంకు ప్రస్తావించింది. JAM(జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్) అనుసంధానం వల్ల 2008 నాటికి ఆర్థిక వ్యవస్థలో 25 శాతంగా ఉన్న ప్రజల భాగస్వామ్య రేటు కేవలం 6 ఏళ్లలో 80 శాతానికి పైగా పెరిగినట్లు పేర్కొంది.
తద్వారా 5 దశాబ్దాలు పట్టే ఆర్థిక డెవలప్‌మెంట్ కేవలం 6 ఏళ్లలో సుసాధ్యమైందంటూ కొనియాడింది. 312 కీలక పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు నేరుగా 30.02 లక్షల కోట్లు బదిలీ చేసినట్లు చెప్పింది. తద్వారా మార్చి 2022 నాటికి ప్రభుత్వానికి GDPలో దాదాపు 1.4 శాతం అంటే దాదాపు 2.74 లక్షల కోట్లు ఆదా అయినట్లు వెల్లడించింది.
భారత సొంత పేమెంట్ సిస్టమ్ UPI మీదా వరల్డ్ బ్యాంకు ప్రశంసల వర్షం కురిపించింది. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ ఆర్కిటెక్చర్ ను ఇండియా రూపొందించినట్లు పేర్కొంది. ఒక్కే మే 2023లోనే దాదాపు 14.89 లక్షల కోట్ల విలువైన 941 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సం మొత్తంగా చూస్తే UPI లావాదేవీల మొత్తం విలువ దేశ GDPలో దాదాపు 50 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications