India GDP: జీడీపీ అంచనాలకు ప్రపంచ బ్యాంక్ కత్తెర.. ఈ సారి పరిస్థితి కష్టమే..!
World Bank On GDP: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికం నెమ్మదిస్తుందని ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల్లో ప్రకటించింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా డిమాండ్ తరుగుదల ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ క్రమంలో కొత్త ఏడాది భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి 6.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.
ఇదే క్రమంలో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణం 6.6 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అలాగే కరెంట్ ఖాతా లోటు 5.2 శాతంగా ఉంటుందని వెల్లడించింది. ఆర్థిక సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం వృద్ధిని అంచనా వేయగా.. RBI మాత్రం FY24కి వృద్ధి అంచనాలను 6.4 శాతానికి పరిమితం చేసింది.

ఇదే క్రమంలో ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉన్న సవాళ్ల వాతావరణం కారణంగా 2024 నూతన ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. తాజా ప్రకటనకు ముందు ప్రపంచ బ్యాంక్ భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అయితే మారుతున్న మైక్రో-మ్యాక్రో ఎకనమిక్ కారణాల దృష్యా దానిని 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది 6.3 శాతానికి పరిమితం చేసింది.
పెరుగుతున్న రుణ ఖర్చులు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి వంటి కారణాలు ప్రైవేట్ వినియోగ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంక్ తన రిపోర్టులో పేర్కొంది. కరోనా మహమ్మారి సంబంధిత ఆర్థిక సహాయ చర్యలను ఉపసంహరించుకున్నందున ప్రభుత్వ వినియోగం నెమ్మదిగా పెరుగుతోందని అంచనా వేసింది. మెుత్తానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థసైతం నెమ్మదించటాన్ని చూడవచ్చని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications