For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

India GDP: జీడీపీ వృద్ధిపై నీలిమేఘాలు.. వరల్డ్ బ్యాంక్ తాజా అంచనాలు .. మన పరిస్థితి..?

|

India GDP: ఆర్థిక మాంద్యం మబ్బులు అలుముకుంటున్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే సమయంలో సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం మాటున వడ్డీ రేట్లు పెంచటం వల్ల డిమాండ్ తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రపంచ బ్యాంక్ ఈ నష్టాలను పేర్కొంటూ భారత ఆర్థిక వృద్ధి అంచనాలను భారీగా తగ్గించింది.

రిజర్వు బ్యాంక్ అంచనాలు..

రిజర్వు బ్యాంక్ అంచనాలు..

దేశీయ వృద్ధి రేటును గత నెలలో అంచనా వేసిన 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల కంటే ప్రపంచ బ్యాంక్ తక్కువ రేటు ఉంటుందని అంచనా వేస్తోంది. కరోనా మహమ్మారి వల్ల కలిగిన దీర్ఘకాలిక ఇబ్బందులు ఈ ప్రాంతంలోని అనేక దేశాలపై పడిందని తెలిపింది. అయితే ఈ క్రమంలో కొన్ని దేశాలు వేగంగా దాని నుంచి కోలుగుంటున్నాయని పేర్కొంది. భారత ఎగుమతులు, సేవల రంగం వేగంగా పుంజుకోవటాన్ని ఉదహరించింది.

తగ్గింపు ప్రభావం..

తగ్గింపు ప్రభావం..

భారతదేశ స్థూల దేశీయోత్పత్తి మార్చి నుంచి ఏడాదిలో 6.5 శాతం వృద్ధి చెందుతుందని గురువారం విడుదల చేసిన సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక వృద్ధిపై 1.40 శాతం కోత విధించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశానికి ముందు ఈ వివరాలు విడుదల కావటం ఆర్థిక వేత్తలను ఆకర్షిస్తోంది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారతదేశం బలంగా పుంజుకుంటోందని పేర్కొంది.

రష్యా-ఉక్రెయిన్ వార్..

రష్యా-ఉక్రెయిన్ వార్..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ మానిటరీ పాలసీ కఠినతరం నుంచి స్పిల్‌ఓవర్‌లు భారతదేశ ఆర్థిక దృక్పథంపై ప్రభావం చూపుతాయని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. పెరిగిన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రుణ వ్యయాలు దేశీయంగా రిటైల్ డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయని, ఇది పరోక్షంగా మందగమనంవైపు నడిపిస్తుందని వెల్లడించింది. దీనివల్ల దేశ ఎగుమతులు దెబ్బతింటాయని పేర్కొంది.

UNCTAD అంచనాలు..

UNCTAD అంచనాలు..

యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ 2022 అంచనా ప్రకారం.. భారత్ ఈ ఆర్థిక సంవత్సరం 5.7 శాతం వృద్ధిని నమోదు చేయగలదని తెలిపింది. ఇది రిజర్వు బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అంచనాల కంటే చాలా తక్కువని చెప్పుకోవాలి. అధిక ఫైనాన్సింగ్ ఖర్చు, ప్రజా వ్యయాల బలహీనంగా ఉండటమే దీనికి కారణమని పేర్కొంది. 2021లో భారత వృద్ధిరేటు 8.20 శాతంగా ఉండేదని తెలిపింది. దేశ జీడీపీ 2023లో 4.70 శాతానికి క్షీణిస్తుందని యూఎన్ ఏజెన్సీ లెక్కగట్టింది.

Read more about: gdp world bank
English summary

India GDP: జీడీపీ వృద్ధిపై నీలిమేఘాలు.. వరల్డ్ బ్యాంక్ తాజా అంచనాలు .. మన పరిస్థితి..? | world bank and UNCTAD reduced india's gdp forecasts amid economic slow down

world bank and UNCTAD reduced india's gdp forecasts amid economic slow down
Story first published: Friday, October 7, 2022, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X