Employees Resignation: ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలు ప్రస్తుతం ఉద్యోగానికి ముడిపడి ఉన్నాయి. చాలా మంది తమ ప్రియమైన వారితో కంటే ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇదే క్రమంలో ఇండియాలో కొందరు పరిశ్రమ పెద్దలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని సూచనలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఇలాంటి సమయంలో ఉద్యోగులు సైతం కొత్త ప్రవర్తనతో ట్రెడ్ సెట్ చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు చేతిలో కొత్త ఉద్యోగం లేకమునుపే ఉన్న ఉద్యోగాన్ని మానేస్తున్నారు. గతంలో వేరే పని దొరికేంత వరకు ఉన్న ఉద్యోగం మానేవారు కాదు. కానీ ప్రస్తుతం చాలా రంగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ దీనికి విరుద్ధంగా కొత్త పద్దతిని ఫాల్ అవుతున్నారు. చాలా మంది ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాన్ని బ్యాకప్ లేకుండానే మానేస్తున్న ట్రెడ్ ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోందని సీనియర్ హెచ్ఆర్ నికిత ఫర్స్వాన్ వెల్లడించారు.

ఉద్యోగ స్థలంలో మార్పుల వల్ల ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లు మారుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉద్యోగులు తమ ఉపాధి భద్రతకు బదులుగా మానసిక ఆరోగ్యం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని తేలిందని నికిత తెలిపారు. అలాగే ఉద్యోగులు జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ కూడా ముఖ్యంగా వారు భావిస్తున్నారని ఆమె వెల్లడించారు. మార్కెట్లో నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగుల నియామకంతో పాటు ఫ్రీలాన్సింగ్ వర్క్ వంటివి కొత్త రిమోట్ వర్క్ అవకాశాలను కల్పించటం కూడా ఉద్యోగుల ఆలోచనలు మారటానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
ఉద్యోగం కోల్పోయినప్పటికీ వెంటనే మరో ఉద్యోగం దొరుకుతుందని లేదా ఇతర ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోవచ్చనే ధైర్యం, విశ్వాసం నేటి తరం వర్కింగ్ ప్రొఫెషనల్స్ లో పెరగటం కూడా నిరుద్యోగులుగా మారటం అనే ఆందోళనలకు చెక్ పెట్టిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో పనిచేస్తున్న మిలీనియల్స్, జెన్ Z, యువ నిపుణుల వృత్తిపరమైన విజయ విలువలు ఈ ధోరణిని ముందుకు నెట్టివేస్తాయి. చాలా మంది నేటి తరం యువత ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయటం కంటే కూడా తమ వ్యక్తిత్వ అభివృద్ధి, కెరీర్ పరంగా వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
సడెన్ రెజిగ్నేషన్స్ ఇందుకే..
ఉద్యోగులు బ్యాకప్ ప్లాన్ లేకుండా తమ ఉద్యోగాలను విడిచిపెట్టడానికి ప్రధాన కారణం విషపూరితంగా మారిన ఆఫీసు వాతావరణమేనని చాలా మంది చెబుతున్నారు. పనిచేస్తున్న ప్రదేశంలో గుర్తింపు లేకపోవటాన్ని సైతం నేటి తరం ఉద్యోగులు సహించటం లేదు. ఈ ధోరణి హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కి ఒక వేకప్ కాల్ లాంటిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు ఉద్యోగి ఎంగేజ్మెంట్, కెరీర్ గ్రోత్, పాజిటివ్ వర్క్ కల్చర్ అందించాల్సి ఉంటుందని నికిత ఫర్స్వాన్ సూచిస్తున్నారు. దేశంలోని ఐటీ రంగంలో కూడా దీనికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications