అతని తండ్రి సంపన్నుడు కాదు.. ఓ కాఫీ తోటలో పని చేసే కూలీ. అయినా ముందడుగేశాడు. ఏడాదికి రూ.100 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. అతనే iD ఫ్రెష్ ఫుడ్ సీఈఓ ముస్తఫా. కేరళకు చెందిన ముస్తాఫా పేద కుటుంబం నుంచి పైకొచ్చాడు. తండ్రి కాఫీ తోటలో పని చేసే కూలీ. తండ్రితో పాటు ముస్తఫా కూలీకి కూడా వెళ్లాడు. పని చేసుకుంటునే చదువుకున్నాడు. పదో తరగతిలో టాపర్ గా నిలిచాడు.
చివరికి ఎన్ఐటీలో సీట్ సాధించాడు. విజయవంతంగా ఇంజినీరింగ్ పూర్తి చేసి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అమెరికా, యూరప్ దేశాల్లో పని చేశాడు. చివరికి బెంగళూరు చేరుకున్నాడు. అక్కడ రోజు ఉదయం టిఫిన్ చేసేవాడు. అయితే టిఫిన్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని భావించిన అతని మెదడులో ఓ ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే ఇప్పుడు అతన్ని కోటీశ్వరుడిని చేసింది.

ఇడ్లి, దోశ పిండి అమ్మాలని నిర్ణయించుకున్న అతను వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా వ్యాపారాన్ని క్రమంగా విస్తారించాడు. ప్రస్తుతం వారి కంపెనీ టర్నోవర్ సంవత్సరానికి రూ.300 కోట్లకు పెరిగింది. ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీకి అజీమ్ ప్రేమ్ జి మద్దతు కూడా ఉంది. iD ఫ్రెష్ ఫుడ్ పిండితో ప్రారంభమై.. తరువాత పరాటా, చపాతీలు వంటి ఇతర తాజా ఉత్పత్తులలోకి ప్రవేశించింది.
"మూడున్నర సంవత్సరాల క్రితం మేము పనీర్‌ను అమ్మడం ప్రారంభించాము. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్గాలలో ఒకటిగా నెలకు సుమారు రూ. 5 కోట్లను అందజేస్తుంది. వచ్చే సంవత్సరంలో దీనిని రూ. 100 కోట్లకు తీసుకువెళ్లాలనేది ప్రణాళిక. మేము తర్వాత పెరుగును అమ్మడం ప్రారంభించాము. ఒక సంవత్సరంలోనే, ఇది నెలకు సుమారు రూ. 2.5 కోట్లు చేస్తోంది" అని కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీకి నాలుగు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో మూడు ఉండగా..బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఒక్కోక్కటి ఉంది. మరో కేంద్రం యూఏఈలోని అజ్మాన్ లో ఉంది. త్వరలో ఢిల్లీలో ఒక ప్లాంట్‌ను, కోల్‌కతాలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications