work-life balance : యూకే వ్యాపారవేత్త టామ్ గ్రోగన్ (Tom Grogan) తన వ్యాపారాన్ని విక్రయించి బిలియనీర్‌గా మారిన తర్వాత కూడా జీవితంలో సంతృప్తి దొరకలేదని చెప్పి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. 35 ఏళ్ల వయస్సులోనే వింగ్‌స్టాప్ UKలో తన మెజారిటీ వాటాను అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించిన అతను 400 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 4,670 కోట్లు) సంపాదించాడు. ఆర్థికంగా విజయవంతమైన ఈ ఒప్పందం తరువాత.. ట్రంప్‌లా బిజినెస్ ప్రపంచంలో పేరు సంపాదించిన గ్రోగన్ ఇప్పుడు తిరిగి పనిలోకి రావాలని నిర్ణయించుకున్నాడు.జీవితం ఖాళీగా ఉంటే చాలా బోరింగ్ గా ఉందని ఫీల్ అవుతున్నాడు.
టామ్ గ్రోగన్ దాదాపు 10 సంవత్సరాలు వింగ్‌స్టాప్ బ్రాండ్‌ను యూకేలో నిలబెట్టడానికి కష్టపడ్డాడు. టెక్సాస్‌లోని ప్రధాన సంస్థకు కూల్ ఇమెయిల్ పంపడం ద్వారా ప్రారంభించాడు. 50కి పైగా పెట్టుబడిదారుల తిరస్కరణలను ఎదుర్కొని.. చివరకు 57 రెస్టారెంట్‌లను స్థాపించాడు. ఈ పయనంలో ఎదురైన అడ్డంకులు, ఆర్థిక ఒత్తిడి, నిరంతర కృషి అన్నీ కలిపి ఈ ప్రయాణాన్ని సార్థకం చేశాయి. అయితే ఈ విజయానంతరం వచ్చిన ఖాళీ తనను ఆశ్చర్యపరిచిందని గ్రోగన్ చెబుతున్నాడు.

"ఏడు సంవత్సరాలుగా నా మనస్సు అంతా ఈ వ్యాపారంపైనే ఉంది. విజయం సాధించిన తర్వాత అకస్మాత్తుగా ఆ ఆలోచన అంతా ఆగిపోతుంది. ఇప్పుడు ఏమిటి? అన్న ప్రశ్న నాకు మిగులుతుంది. డబ్బు ఉన్నా, ఆ శూన్యతను పూరించలేదని గ్రోగన్ అంగీకరించాడు. తన కెరీర్‌ను గంటకు 5 పౌండ్ల జీతంతో నిర్మాణ కార్మికుడిగా ప్రారంభించిన టామ్.. ఇప్పుడు తిరిగి మళ్లీ పనిలోకి రావాలని నిర్ణయించాడు. అయితే తన తదుపరి వెంచర్ ఏ రంగంలో ఉంటుందో అతనికి ఇంకా ఖచ్చితంగా తెలియదని చెప్పాడు.
ఇది బహుశా ఆహారం లేదా పానీయాల రంగంలో ఉండకపోవచ్చని గ్రోగన్ స్పష్టం చేశాడు. ఆయన ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటూ, విలాసాలకు దూరంగా జీవిస్తున్నాడు. సహ వ్యవస్థాపకులు హెర్మన్ సహోటా, సాల్ లెవిన్‌లతో కలిసి తన తదుపరి అడుగులపై ఆలోచన చేస్తున్నాడు.జీవితం ఖాళీగా ఉండాలంటే చాలా బోరింగ్‌గా ఉంది. నేను బీచ్‌లో కూర్చుని జీవితాన్ని గడపలేను. మన మనస్సు సవాలు కావాలి, ప్రతిరోజూ లేచి పనిచేయడానికి ఒక ఉద్దేశం కావాలి. కానీ అది ఇప్పుడు మన దగ్గర లేదని గ్రోగన్ candidగా చెప్పాడు.
గ్రోగన్ ఒక్కరే ఈ భావనను అనుభవించిన వ్యక్తి కాదు. Airbnb వ్యవస్థాపకుడు బ్రియాన్ చెస్కీ తన కంపెనీ IPO ద్వారా బిలియనీర్ అయిన తర్వాత కూడా ఖాళీగా అనిపించిందని వెల్లడించాడు.పర్వతం అడుగున ఆశ ఉంటుంది, కానీ పైకి చేరుకున్నప్పుడు మీరు ఒంటరిగా ఉంటారని చెస్కీ చెప్పాడు. అలాగే భారతీయ మూలాల వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ శంకర్ తన కంపెనీని 500 మిలియన్ డాలర్లకు విక్రయించిన తర్వాత జీవితంలో ఉద్దేశ్యం కోల్పోయినట్లు వెల్లడించాడు.
15 సంవత్సరాల కృషి తర్వాత ఒక్కసారిగా పని లేకపోవడం అతనికి కష్టంగా అనిపించిందని.. ప్లేస్టేషన్, గోల్ఫ్ సరదా కోసం ఉండొచ్చు, కానీ అవి జీవితానికి అర్థం ఇవ్వవని హాస్యంగా అన్నాడు.ఏదేమైనా టామ్ గ్రోగన్ కథ డబ్బు, విజయాలు కంటే జీవితంలో లక్ష్యం (purpose) ఎంత ముఖ్యమో గుర్తుచేస్తోంది. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నా, మానసిక సంతృప్తి కోసం మనిషి నిరంతరం సవాళ్లు ఎదుర్కోవాలని, కొత్త ఉద్దేశ్యాన్ని కనుగొనాలని ఈ కథ కళ్లకు కట్టినట్లు చెబుతోంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications