వర్క్ ఫ్రం హోం ఎండ్.. ఇకపై ఆఫీసుకు వెళ్లాల్సిందే.. కీలక నిర్ణయం తీసుకుంటున్న కార్పోరేట్ ప్రపంచం..

కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పని విధానాల్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పవచ్చు. అయితే 2025 నాటికి ఆ మోడల్ క్రమంగా ముగింపు దశకు చేరుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ టెక్, ఫైనాన్స్, కన్సల్టింగ్ కంపెనీలు ఉద్యోగులను మళ్లీ పూర్తిస్థాయిలో కార్యాలయాలకు పిలవడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

2025 ప్రారంభంలోనే అమెజాన్ ఈ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయానికి రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ వెంటనే డెల్, ఐబిఎం, మెటా, సేల్స్‌ఫోర్స్, స్నాప్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గజ టెక్ సంస్థలు కూడా ఇలాంటి విధానాలనే అమలు చేయడం ప్రారంభించాయి. ఫైనాన్స్ రంగంలో గోల్డ్‌మన్ సాచ్స్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇప్పటికే ఆఫీస్ వర్క్‌కు బలమైన మద్దతు ఇస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో డిస్నీ, టెలికాం రంగంలో ఎటి అండ్ టి కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.

work from home dead WFH officially dead remote work ending end of work from home return to office trend office comeback hybrid work model global recruitment company CEO world s largest recruitment firm hiring trends 2025 future of work corporate work culture shift employee return to office remote work policy changes CEO on work from home workplace trends global job market news WFH CEO

సంవత్సరం చివర్లో ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి చేసిన ప్రకటన ఈ మార్పును మరింత బలపరిచింది. ఆయన పంపిన కంపెనీవైడ్ మెమో ప్రకారం.. ఫిబ్రవరి 2 నుంచి అమెరికాలోని ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఇది మెటా గ్రూప్‌లో కూడా రిటర్న్-టు-ఆఫీస్ విధానం ఎంత గట్టిగా అమలవుతుందో చూపిస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ సంస్థలలో ఒకటైన రాండ్‌స్టాడ్ గ్లోబల్ సీఈఓ సాండర్ వాంట్ నూర్డెండే దీనిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఫార్చ్యూన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గ్రేట్ రిటర్న్-టు-ఆఫీస్ వార్ ఇప్పుడు ముగిసింది. ఇకపై పూర్తిగా రిమోట్ ఉద్యోగాలు సాధారణ ఉద్యోగుల కోసం కాకుండా.. స్టార్ పెర్ఫార్మర్లు లేదా అత్యంత ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే పరిమితమవుతాయని చెప్పారు. 100 శాతం రిమోట్ ఉద్యోగాన్ని డిమాండ్ చేయాలంటే, మీరు చాలా ప్రత్యేకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

కార్న్ ఫెర్రీ సంస్థ కూడా ఇదే విషయాన్ని తన తాజా నివేదికలో వెల్లడించింది. కంపెనీలు ఆఫీస్ వర్క్‌పై మరింత దృష్టి పెట్టడంతో.. కొత్త హైబ్రిడ్ సోపానక్రమం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఇందులో ఫ్లెక్సిబిలిటీ అనేది అందరికీ లభించే హక్కుగా కాకుండా.. టాప్ టాలెంట్‌కు మాత్రమే ఇచ్చే ప్రత్యేక సౌకర్యంగా మారనుంది. 2025లో ఉద్యోగ మార్కెట్‌లో ఉన్నవారు - లేనివారు అన్న విభజన ఆర్థిక పరిస్థితుల వల్ల కాకుండా.. ప్రతిభ, కంపెనీకి ఆ ఉద్యోగి ఎంత అవసరమో అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది.

జూనియర్ స్థాయి లేదా సులభంగా భర్తీ చేయగల పాత్రల్లో ఉన్న ఉద్యోగులు మాత్రం కార్యాలయానికి రావాల్సిందేనని కంపెనీలు స్పష్టంగా చెబుతున్నాయి. అమెజాన్ క్లౌడ్ విభాగం అధిపతి మాట్ గార్మాన్ అయితే.. కార్యాలయం నుంచి పని చేయడాన్ని అంగీకరించని వారు వెళ్లిపోవచ్చని కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఏదేమైనా రిమోట్, హైబ్రిడ్ మోడళ్లకు 2025లో పెద్ద ఎత్తున బ్రేక్ పడుతోంది. ఐదేళ్ల రిమోట్ వర్క్ ప్రయోగం తర్వాత.. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం మళ్లీ కార్యాలయాలకు ఉద్యోగులను పిలుస్తోంది. Work from home కు శాశ్వత వీడ్కోలు పలికేందుకు రెడీ అవుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+