ప్రతి నెలా జీతం నుంచి కొంత డబ్బు కట్ అవుతుందని మనం అందరం గమనిస్తాం. కానీ ఆ డబ్బు ఎక్కడికి పోతుందో, ఎంత చేరిందో ఎప్పుడైనా చెక్ చేశారా? చాలామంది చివర్లో డబ్బు తీయాల్సినప్పుడు మాత్రమే PF గుర్తు తెచ్చుకుంటారు. కానీ నిజానికి PF అనేది మన భవిష్యత్తు కోసం దాచుకున్న చిన్న చిన్న పొదుపుల ఖజానా. ఇప్పుడు దాన్ని మొబైల్‌లోనే 2 నిమిషాల్లో చూసేయొచ్చు.

PF డబ్బు తెలుసుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి:
PF డబ్బు తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టెక్నాలజీ వల్ల ఇది చాలా ఈజీ అయిపోయింది.
1. మొదటగా, EPFO అధికారిక వెబ్‌సైట్ ఉంది. అక్కడ మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి పాస్‌బుక్ చూడొచ్చు. నెట్‌లో చూసుకోవడమే కదా అని మీరు సింపుల్‌గా ఫీల్ అవుతారు.
2. ఇంటర్నెట్ వాడలేని సిట్యువేషన్‌లో కూడా టెన్షన్ అవసరం లేదు. మీ మొబైల్ నుంచి SMS పంపడం లేదా ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ PF బ్యాలెన్స్‌ని వెంటనే తెలుసుకోవచ్చు. ఇది చాలామందికి ఈజీగా అనిపించే ఆప్షన్.
3. ఇంటర్నెట్ లేకపోయినా టెన్షన్ అవసరం లేదు. 9966044425 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే లేదా SMS పంపితే కూడా PF బ్యాలెన్స్ ఫోన్‌కి వస్తుంది.
4. ఇంకా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవాళ్లకి మరో సౌకర్యం ఉంది. UMANG యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అయ్యి అందులో చూసుకోవచ్చు. అక్కడ EPFO సర్వీస్ సెక్షన్‌లోకి వెళ్తే, మీ PF ఖాతా వివరాలు సులభంగా కనిపిస్తాయి. UMANG యాప్ వాడేవాళ్లకు అదనంగా PF విత్‌డ్రాయల్ సదుపాయం కూడా ఉంటుంది.
5. తాజాగా వచ్చిన మరో యూజ్‌ఫుల్ ఆప్షన్ కూడా వచ్చింది. డిజిలాకర్ ద్వారా PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? ముందుగా డిజిలాకర్ యాప్ డౌన్‌లోడ్ చేసి లాగిన్ అవ్వాలి. అందులో మీ ఆధార్‌ని EPFO అకౌంట్‌తో లింక్ చేయాలి. ఆ తర్వాత EPFO సెక్షన్‌లోకి వెళ్ళాలి. అక్కడ పాస్‌బుక్, UAN కార్డ్, PPO అన్నీ సింపుల్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. తాజా PF బ్యాలెన్స్, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయో లైవ్‌గా చెక్ చేసుకోవచ్చు.
ముందుగా PF పాస్‌బుక్‌ని రెగ్యులర్ గా చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని సార్లు కంపెనీ PF డబ్బు కట్ చేసి కూడా జమ చేయకపోవచ్చు. అలాంటి సమస్యలను వెంటనే గుర్తించడానికి పాస్‌బుక్ చూస్తూ ఉండటం ఉపయోగ పడుతుంది. అలాగే PFలో జమ అయ్యే డబ్బు, దానిపై వచ్చే వడ్డీ రెండూ ఎక్కువగా ట్యాక్స్ ఫ్రీ. అంటే మనకి అదనంగా ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది. అందుకే PF అనేది కేవలం పొదుపు మాత్రమే కాదు, ఒక ట్యాక్స్ సేవింగ్ టూల్ కూడా. అంతేకాదు, PF మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటం వల్ల డబ్బు సేఫ్టీ గురించి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇది పూర్తిగా నమ్మకంగా ఉండే పొదుపు పద్ధతి అని చెప్పొచ్చు.
మొత్తానికి, PF అనేది మన భవిష్యత్తు కోసం మనకు సైలెంట్‌గా జమ అవుతున్న డబ్బు. దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటే, ఎంత సేవింగ్స్ కలిసాయో, ఎంత ప్లాన్ చేసుకోవాలో మనకే స్పష్టంగా తెలుస్తుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications