మన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మహిళాలకు పెద్ద గిఫ్ట్ అందించింది. ఏంటంటే ఇప్పడు మహిళలకు ఎస్బిఐ తక్కువ వడ్డీ రేట్లతో అన్‌సెక్యూర్డ్ లోన్స్ అందించనుంది. దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా SBI 'ఆస్మిత' పేరుతో ప్రవేశపెట్టింది. మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే నిధులు అందించడమే దీని ముఖ్య ఉదేశ్యం. బ్యాంకు చైర్మన్ ఏం ఏమన్నారంటే: మహిళలు నడిపించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు త్వరగా, సులభంగా క్రెడిట్ యాక్సెస్ పొందడానికి ఈ కొత్త ఆఫర్ సహాయపడుతుందని SBI చైర్మన్ C S శెట్టి అన్నారు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ టోన్సే ఈ కొత్త ఆఫర్ టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ అండ్ సామాజిక సమానత్వానికి చిహ్నం అని అభివర్ణించారు. ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ఎస్బిఐ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత 'నారి శక్తి' ప్లాటినం డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన
మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా నిన్న శుక్రవారం భారతీయ సంతతికి చెందిన మహిళల కోసం 'BOB గ్లోబల్ ఉమెన్ NRE & NRO సేవింగ్స్ అకౌంట్'ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లకు లాకర్ రెంట్ పై డిస్కౌంట్'తో పాటు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ, హోమ్ లోన్ ఇంకా తక్కువ ప్రాసెసింగ్ ఛార్జ్'తో ఆటో లోన్ వంటి సౌకర్యాలు అందిస్తుంది.

"BOB గ్లోబల్ ఉమెన్ NRE అండ్ NRO సేవింగ్స్ అకౌంట్ నేటి ప్రపంచ భారతీయ మహిళల మారుతున్న డైనమిక్స్ గుర్తిస్తుంది. దీని ద్వారా మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ అధికారాలు, ఆలోచనాత్మకంగా రూపొందించిన ఫీచర్స్ అందించడం ద్వారా వారిని శక్తివంతం చేయడానికి రూపొందించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బినా వహీద్ అన్నారు. కొత్తగా రూపొందించిన BOB ప్రీమియం NRE అండ్ NRO సేవింగ్స్ అకౌంట్ చాల ఫీచర్లతో వస్తుంది, వీటిలో మంచి ట్రాన్సక్షన్స్ లిమిట్'తో కస్టమైజ్ డెబిట్ కార్డ్, ఉచిత దేశీయ ఇంకా అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్, ఉచిత సేఫ్ డిపాజిట్ లాకర్లు, ఉచిత వ్యక్తిగత ఇంకా విమాన ప్రమాద బీమా కవరేజ్ ఉన్నాయని బ్యాంక్ తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications