Lottery News: ఎవరికైనా అదృష్టం ఒక్కసారే తలుపుతడుతుంది. కానీ దురదృష్టం మాత్రం తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుందని చాలా మంది అంటుంటారు. కానీ ఒక మహిళ సరదగా చేసిన పని ఆమెకు ఏకంగా రూ.2 కోట్లను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నార్త్ కరోలినాలోని కెర్నర్స్‌విల్లేకు చెందిన కెల్లీ స్పాహర్ అనే మహిళకు తగిలిన అదృష్టం గురించే. వాస్తవానికి అమెరికాకు చెందిన ఈ మహిళ తన ప్రయాణంలో ఆరెంజ్ జ్యూస్ తాగటం కోసం ఆగిన సమయంలో చేసిన చిన్న పని ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ సమయంలో ఆమె అక్కడ అమ్ముతున్న లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేయటంతో ప్రస్తుతం 2.5 లక్షల డాలర్లను బహుమతిగా అందుకున్నారు.

ప్రయాణ సమయంలో ఆరెంజ్ జ్యూస్ తాగుదామని స్పాహర్.. పైనీ గ్రోవ్ రోడ్‌లోని క్వాలిటీ మార్ట్ వద్ద ఆగారు. ఆ సమయంలో ఆ మహిళ రూ.1600 ($20) విలువైన మెర్రీ మల్టిప్లియర్ స్క్రాచ్-ఆఫ్ టిక్కెట్‌ను కొనుగోలు చేసింది. అయితే ఈ లాటరీ డ్రాలో ఆమె లక్కీ లేడీ విజేతగా నిలిచింది. తాను టిక్కెట్ కొనుగోలు చేసినప్పటి అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.. గ్యాస్ స్టేషన్‌లో కొత్త టిక్కెట్లు ఉన్నాయని గమనించి ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్నానని ఆమె వెల్లడించారు. టిక్కెట్లలో ఉన్న మడత భాగం తనను ఆకర్షించినట్లు ఆమె వెల్లడించారు.
ఇలాంటి అనుభూతే మరో లాటరీ విజేత సైతం పంచుకున్నారు. వాస్తవానికి తాను మధ్యహ్న భోజనం ఇంట్లో మర్చిపోవటం దానికోసం ఇంటికి తిరిగి వెళ్లటానికి బదులుగా ఒక కిరాణా దుకాణానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అనుకోకుండా అక్కడ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశానని దాని నుంచి రూ.25.24 కోట్ల బహుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో అన్ని సున్నాలు చూసి ఆశ్చర్యానికి గురైనట్లు అతను పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని తన భార్యతో చెప్పగా జోక్ చేస్తున్నాడేమోనని ఆమె లైట్ తీసుకుంది. అయితే మెుత్తం విషయం చెప్పిన తర్వాత ఆమె భర్త చెప్పిన విషయం విని ఆశ్చర్యానికి గురైందని సదరు విజేత వెల్లడించాడు. మిలియనీర్ బక్స్ స్కాచర్స్ గేమ్ కింద ఈ భారీ మెుత్తాన్ని అందుకున్నట్లు అతను పేర్కొన్నాడు. సాధారణంగా తాను 30 డాలర్ల చిక్కెట్లు కొనుగోలు చేయనని అయితే గతంలో ఇదే గేమ్ లో గెలిచిన 60 డాలర్లు తన వద్ద ఉండటంతో అలా చేసినట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications