Real Estate: అరె ఎంట్రా ఇది..! అద్దెకు సగం మంచం.. నెలకు రెంట్ రూ.54 వేలు..
Canada News: ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో అద్దెలు ఊపందుకున్నాయి. చిన్న పట్టణాల్లో కనీసం రూ.5 వేలు అద్దెకు లభిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం భారతీయులు ఎగబడి మరీ వెళుతున్న కెనడాలో అద్దెలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కెనడా రాజధాని టొరంటోలో ఇంటి అద్దెలు వింటే మతిపోతోంది. ఈ నగరంలో హౌసింగ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ క్రమంలో టొరంటోకు చెందిన రియల్టర్ అన్య ఎట్టింగర్ నెలకు రూ.54,000 చొప్పున బెడ్‌రూమ్‌ను పంచుకోవడానికి రూమ్‌మేట్ కోసం వెతుకుతున్న ఒక మహిళ ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో పోస్ట్ చేసిన ప్రకటనను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాను కాండోలో లేక్-వ్యూ మాస్టర్ బెడ్‌రూమ్, క్వీన్-సైజ్ బెడ్‌ను పంచుకోవడానికి లేడీ కోసం వెతుకుతున్నానని అందులో ఉంది.

గతంలో తాను ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయితో బెడ్‌రూమ్‌ని పంచుకున్నాని, అది బాగుందని సదరు మహిళ రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. వాస్తవానికి సగం మంచాన్ని అద్దెకు ఇవ్వడానికి మహిళ చేసిన ప్రయత్నం ఓకే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే చాలా మంది వినియోగదారులు మహిళ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు వినటానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సదరు మహిళ నివసిస్తున్నది టొరంటోలో అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్ అని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ నెల అద్దె దాదాపు 2,614 డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అద్దె ఖర్చులను తగ్గించుకునేందుకు ఇలా తెలియని వారితో మంచాన్ని పంచుకునేందుకు కొందరు ఆఫర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications