Lottery News: మీ టైం దగ్గరపడితే ఎవ్వడూ ధనవంతుడిగా మారటాన్ని ఎవ్వరూ ఆపలేరని పెద్ద వాళ్లు చెబుతుంటే మనం వినేవాళ్లం. కానీ ఇప్పుడు అది వాస్తవమేననే విషయం రుజువవుతున్నాయి. కొన్ని సార్లు డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే మాటలు నిజం కాదేమో అనిపించేలా చేస్తుంటాయి ఇలాంటి సందర్భాల్లో.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది లాటరీలో రూ.42.96 లక్షలు గెలుచుకున్న మహిళదే. వాస్తవానికి అమెరికాలోని మేరీలాండ్ ప్రాంతం ప్రిన్స్ జార్జ్ కౌంటీలో ఆమె నివశిస్తున్నారు. అమెరికా కరెన్సీ లెక్కల ప్రకారం ఆమె 50 వేల డాలర్ల ప్రైస్ మనీని లాటరీలో గెలుచుకుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే తనకు కలలో కనిపించిన నంబర్‌తో కూడిన లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసినట్లు సదరు మహిళ చెప్పటం అందరినీ ఆకట్టుకుంటోంది. వాస్తవానికి కొందరికి కలలో కనిపించినవి నిజం అయిన సంఘటనల గురించి పలుమార్లు వార్తల్లో వింటూనే ఉంటాం.

డిసెంబరులో తనకు కలలో కనిపించిన నంబర్లతో కూడిన టిక్కెట్ కొనుగోలు చేసినట్లు సదరు మహిళ లాటరీ అధికారులతో పంచుకుంది. ఇందులో 99000 నంబరు స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. దీని ఆధారంగా తాను ఆక్సన్ హిల్ జిప్ మార్ట్ నుండి 9-9-0-0-0 నంబర్లతో బిగ్ 5 లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ ప్రయాణం అంత సులువుగా జరగలేదని ఆమె పేర్కొంది. తాను కలకన్నప్పటికీ ఆడటం మర్చిపోవటం వల్ల లేటుగా ఆట మెుదలుపెట్టినట్లు పేర్కొంది. అయితే డిసెంబర్ 20న బహుమతిని అందుకున్నట్లు వెల్లడించింది.
తన కలకు సంబంధించిన వివరాలను ఆమె ముందుగా తన భర్తతో షేర్ చేసుకుంది. కానీ ఆయన భార్య చెప్పిన మాటలను నమ్మలేదు. అయితే తనకు కలలో వచ్చిన అంకెలున్న లాటరీ నంబరుతో విజేతగా నిలవటంతో అందరి మాదిరిగా ఆశ్చర్యపోవటంతో పాటు నమ్మాడు. ఈ డబ్బును తన భర్తకు నచ్చిన పనులు చేసేందుకు ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. అనుకోని రూపంలో యూనివర్స్ తాను అందించాలనున్న వాటిని మనుషులకు అందిస్తుందనే విషయాన్ని ఈ ఘటన నిజం చేస్తుందనటానికి ఇది రుజువుగా నిలిచింది.
2024 నవంబర్‌లో సింగపూర్‌లోని భారతీయ సంతతికి చెందిన బాలసుబ్రమణియన్ చిదంబరం రూ.8.45 కోట్ల బహుమతిగా అందుకుని సంపన్నుడిగా మారిపోయాడు. ముస్తఫా జ్యూయలరీలో జరిగే లాటరీలో పాల్గొని తన భార్యకు బంగారు గొలుసు కొనిచ్చేవాడు. అప్పుడే అతనికి ఈ అదృష్టం దక్కింది. షాపు యజమానులు దీనికి సంబంధించిన వివరాలను తర్వాత సోషల్ మీడియాలో వార్తలను పంచుకుంది. దీని ద్వారా అదృష్టం మనకు ఎప్పుడైనా, ఎలాగైనా వస్తుందని నిరూపించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications