Google: టెక్ దిగ్గజం గూగుల్ కు ఈ ఏడాది అంతగా బాగున్నట్లు లేదు. ఎన్నో రకాల కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ప్రభుత్వాలు, ప్రత్యర్థి కంపెనీలు.. గూగుల్ పై దావాలు వేశాయి. కాగా ఇప్పుడు ఓ వ్యక్తి మరణానికి ఆ సంస్థే కారణమంటూ మృతుడి కుటుంబం కోర్టు మెట్లెక్కింది.
భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ సేవల కోసం గూగుల్ మ్యాప్స్ వినియోగిస్తూ ఉంటాం. ఒక్కోసారి గూగుల్ తల్లి చూపించే దారులు చూసి పిచ్చెక్కుతుంది. అయితే అమెరికాలోని నార్క్ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి.. గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ కారు నడిపాడు. అదికాస్తా కూలిపోయిన వంతెనపైకి తీసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన ఆధారంగా మృతుడి కుటుంబం గూగుల్ పై వేక్ కౌంటీ సుపీరియర్ కోర్టులో దావా వేసింది. సాంకేతిక దిగ్గజం నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణం సంభవించిందని వాదిస్తోంది. వంతెన కూలిపోవడం గురించి గూగుల్ కు సమాచారం అందినా.. తన నావిగేషన్ సిస్టమ్ ను అప్ డేట్ చేయడంలో విఫలమైందని ఆరోపించింది.
తొమ్మిదేళ్ల క్రితం కుప్పకూలి, మరమ్మతుకు నోచుకోని వంతెనను దాటమని గూగుల్ మ్యాప్స్ సూచించడంపై మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రూట్ కు సవరణ చేయాల్సిందిగా 2020లో మరో యూజర్ ఇ-మెయిల్ సైతం పంపించినట్లు దావాలో పేర్కొంది. దానిని స్వీకరించి, సమీక్షిస్తున్నట్లు గూగుల్ రిప్లై కూడా ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాజ్యాన్ని రివ్యూ చేస్తున్నట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications