Liquor: చీర్స్ అంటూ అమ్మాయిలు చిల్ అయిపోవటం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలాంటి సీన్స్ మనం జంబలకిడి పంబ సినిమాలో ఒకప్పుడు చూశాం. కానీ ఇది శ్రుచిమించుతోందని తాజా సర్వే వెల్లడించింది.

CADD సర్వే ఫలితాలు..
దేశంలో మద్యం వినియోగం వేగంగా పెరుగుతోందని తేలింది. దీపావళికి ముందు మూడు రోజులు అమ్మకాల షాకింగ్ డేటా ఇదే వెల్లడించింది. దిల్లీ వాసులు ఏకంగా రూ.100 కోట్లకు పైగా మద్యాన్ని తాగేశారని సర్వే వెల్లడించింది. అయితే ఈ విషయంలో మహిళలపై చేసిన సర్వే ప్రకారం మద్యం తాగే మహిళలు మునుపటి కంటే ఎక్కువయ్యారని తెలిసింది. సర్వేలో 5000 మంది మహిళలు పాల్గొనగా వారిలో 77 శాతం మందిని డిస్కౌంట్లు ఎక్కువగా ఆకర్షించాయని చెప్పారు.

కరోనా కాలంలో..
సాధారణ సమయంలో కంటే కరోనా కాలంలో మహిళలు ఎక్కువ మద్యం సేవించారని సర్వేలో వెల్లడైంది. ఆందోళనల నుంచి బయటపడేందుకు చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారని తేలింది. మహిళల్లో 37.6 శాతం మంది తమ మద్యపానం పెరిగినట్లు CADD సర్వేలో తెలిపారు. 42.3 శాతం మంది మహిళలు సందర్భానుసారంగా మద్యపానం పెరిగిందని చెప్పారు. కరోనా తర్వాత 2022 నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి రావటంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.

మహిళల మాట ఇదే..
మహిళల్లో అతిగా మద్యం సేవించేందుకు ఒత్తిడి, ఆందోళనలే ప్రధాన కారణమని వెల్లడైంది. డేటాను పరిశీలిస్తే.. 45.7 శాతం మంది మహిళల్లో వినియోగం పెరగడానికి కారణం టెన్షన్ అని తేలింది. ఇది కాకుండా మద్యం సులువుగా లభించడం వల్ల కూడా వినియోగం పెరిగిందని 34.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమలోని విసుగును అధిగమించేందుకు మద్యాన్ని సేవించినట్లు సర్వేలో పాల్గోన్న 30.1 శాతం మంది స్పష్ట చేశారు.

ఆల్కహాల్ చెడ్డదికాదు..
పురుషులతో పోల్చినప్పుడు క్రమం తప్పకుండా మద్యం తాగే మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కానీ సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే మద్యాన్ని హానికరమైనదిగా, ప్రమాదకరమైనదిగా భావిస్తున్నామని అంగీకరించారు. ఇందులో వారానికి రెండు సార్లు మద్యం సేవిస్తున్నవారి సంఖ్య 38.1% ఉండగా.. వారానికి నాలుగురోజులు మద్యం తాగుతున్న మహిళల సంఖ్య 19.1% గా ఉందని సర్వే వెల్లడించింది.

రోజూ తాగుతున్నారు..
రోజూ 1-2 పానీయాలు తాగుతున్న మహిళల సంఖ్య 36.7%, రోజుకు 3-4 పానీయాలు తాగుతున్న మహిళల సంఖ్య 34.9% ఉండగా.. ఒకేసారి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పానీయాలు తాగుతున్న మహిళల సంఖ్య 28.4% గా ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 18-30 వయస్కులు - 1453, 31- 45 వయస్కులు - 2021, 46- 60 వయస్కులు - 1206, 60 ఏళ్ల వయస్కులు - 320 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు.

రాజధాని నగరంలో..
దేశరాజధాని ఢిల్లీలో అమ్మకాలు 87% పెరుగుతాయని అంచనా వేయబడింది. ఇందులో విస్కీ అమ్మకాలు 59.5 శాతం పెరగగా.. బీర్ అమ్మకాలు 5.5 శాతం మేర పెరిగాయి. డిస్కౌంట్ల వల్ల ఎక్కువ మద్యంపై ఖర్చుచేసినట్లు 39.8% మంది చెప్పటం గమనార్హం. 34.1% మంది ఇంట్లోనే మద్యపానం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. కాగా ఇదే సమయంలో 32.7% మంది మాత్రం బార్‌లు, పబ్‌లకు వెళ్లడానికి ఇష్టపడుతున్నామని వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications