For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాటలే పెట్టుబడిగా, పురుషులకు ధీటుగా .. రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల దూకుడు

|

ఏ రంగంలో చూసిన మహిళలు తమదైన శైలిలో దూకుడు చూపిస్తూనే ఉన్నారు. ఆకాశంలో సగం అవనిలో సగం అని చెప్పుకునే మహిళలు తమ శక్తిని, యుక్తిని వివిధ రంగాల్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వ్యాపారాలు మహిళలు చేయలేరు అని భావిస్తే, ఇప్పుడు వ్యాపారాల్లో రారాణి మహిళనే అనే భావన వ్యక్తమవుతుంది . ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అంటే మగవాళ్ళు మాత్రమే చేయగలిగే వ్యాపారం అన్నట్టుగా ఉన్న పరిస్థితుల నుండి, ఇప్పుడు ఆడవాళ్లు మేము సైతం అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎస్బీఐ ఈజీ గోల్డ్ లోన్స్ .. 7.5 శాతం వడ్డీ రేటుతో, యోనో యాప్ తో అప్లై చేస్తే బెనిఫిట్ !!ఎస్బీఐ ఈజీ గోల్డ్ లోన్స్ .. 7.5 శాతం వడ్డీ రేటుతో, యోనో యాప్ తో అప్లై చేస్తే బెనిఫిట్ !!

పురుషుల కంటే వేగంగా.. మహిళల రియల్ ఎస్టేట్ వ్యాపారం

పురుషుల కంటే వేగంగా.. మహిళల రియల్ ఎస్టేట్ వ్యాపారం

తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మహిళలు ముందువరుసలో నిలుస్తున్నారు. హైదరాబాద్లోనూ నిమిషాలలో భూములను, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను విక్రయించడంలో మహిళలు దూకుడు చూపిస్తున్నారు. పురుషుల కంటే వేగంగా మహిళలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న పలు సంస్థలు సైతం, తన సంస్థ కోసం పనిచేసే ఉద్యోగులుగా ముఖ్యంగా ఆడవారికి అవకాశాలు ఇస్తున్న పరిస్థితులున్నాయి. మహిళలకు కస్టమర్లను ఒప్పించగల సామర్థ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది అని భావిస్తున్న బడా రియల్టర్లు తమ వ్యాపార నిర్వహణ కోసం మహిళలను రంగంలోకి దింపుతున్నారు.

 వాక్చాతుర్యంతో కస్టమర్లని ఆకట్టుకుంటూ జోరుగా బిజినెస్

వాక్చాతుర్యంతో కస్టమర్లని ఆకట్టుకుంటూ జోరుగా బిజినెస్

కనీసం డిగ్రీ కూడా చదువుకొని మహిళలు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు పి.హెచ్.డి లు చేసినట్లుగా దూసుకుపోతున్నారు. తమ వాక్చాతుర్యంతో కస్టమర్లని ఆకట్టుకుంటూ జోరుగా బిజినెస్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారు. ఇక వరంగల్, కరీంనగర్ తో పాటు కీలక జిల్లాలలో రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. మగవారితో పోలిస్తే మహిళలు అధిక ధరలకు కూడా భూములను విక్రయించగలుగుతున్నారని పలు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు చెబుతున్నాయి.

 పెద్ద పెద్ద రియల్ సంస్థల వెంచర్ల అమ్మకాల్లో మహిళలదే కీలక భూమిక

పెద్ద పెద్ద రియల్ సంస్థల వెంచర్ల అమ్మకాల్లో మహిళలదే కీలక భూమిక

వివిధ సంస్థలు వేసే వెంచర్ల కోసం ప్లాట్లను విక్రయించడానికి మహిళలు రంగంలోకి దిగుతున్న పరిస్థితి ఉంది. మహిళలకు అవకాశం ఇవ్వటం ద్వారా వ్యాపారులు మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా, వారి ద్వారా కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చుని ఉద్యోగాలు చేసే కంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లాభదాయకమైన బిజినెస్ అని భావిస్తున్న మహిళలు, ఆ వ్యాపారంలో ఉన్న సాధకబాధకాలను తెలుసుకొని వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

 ఉన్నతవర్గాలను భాగస్వాములుగా, రియల్ రంగంలో చక్రం తిప్పుతున్న మహిళలు

ఉన్నతవర్గాలను భాగస్వాములుగా, రియల్ రంగంలో చక్రం తిప్పుతున్న మహిళలు

రియల్ ఎస్టేట్ భూములపై పెట్టుబడులు పెట్టే ఉన్నత వర్గాలను పార్ట్ నర్ లుగా ఎంచుకుని వారితో పెట్టుబడి పెట్టించి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా భూములను కొనుగోలు చేయడం, భూములను అమ్మడం ద్వారా కమిషన్ తో పాటుగా, లాభాలను కూడా ఆర్జిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా పురుషులతో పోలిస్తే మహిళల నుండి అధిక పని, అధిక లాభాలు వస్తున్న క్రమంలో తమ వ్యాపార కార్యకలాపాలకు మహిళలే బెస్ట్ అని భావిస్తూ వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో పురుషులను డామినేట్ చేస్తూ మహిళలు ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.

English summary

మాటలే పెట్టుబడిగా, పురుషులకు ధీటుగా .. రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల దూకుడు | Women domination in real estate ; companies interest on women for business

women are at the forefront of the real estate business. In Hyderabad too, women are showing aggression in selling land and big apartments in minutes. Women are doing real estate business faster than men. Many companies that invest in the real estate sector also offer opportunities for women. Realtors, who feel that women have a greater ability to persuade customers than men, are recruiting women to run their businesses.
Story first published: Saturday, August 14, 2021, 18:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X