Business Ideas: మహిళలు ఇంటి నుంచే స్టార్ట్ చేసే బిజినెస్.. మార్కెట్లో క్రేజ్ ఎక్కువ కూడా..
Business Ideas: ఈ రోజుల్లో బతకాలంటే రెండు చేతులా సంపాదిస్తేనే కుదురుతుంది. అందుకే చాలా మంది మహిళలు కుటుంబానికి చేదోడువాడోడుగా ఉండేందుకు ఇంటి దగ్గరి నుంచి చేసే పనుల కోసం వెతుకున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ సాధనాలు కూడా మహిళలకు మంచి వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది బొటిక్ అండ్ శారీ బిజినెస్ గురించే. ఫ్యాషన్ ప్రపంచంలో ఆసక్తి ఉన్న మహిళలు మంచి వ్యాపారవేత్తలుగా ఉన్న చోటి నుంచే ఎదిగవచ్చు.ఇందుకోసం ప్రారంభంలో రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది.

డిజైనరీ కస్టమ్ మేడ్ డ్రస్సెస్, శారీస్ అంటే ప్రస్తుతం మహిళలకు విపరీతమైన ప్రేమ పెరిగింది. ప్రజల ఆదాయాలు పెరగటం వల్ల ఎక్కువ ఖర్చైనా వారికి నచ్చిన వస్త్రాలను కొనుక్కోవాలని చాలా మంది భావిస్తున్నారు. దీనిని అందిపుచ్చుకోవాలి అనుకునేవారు సోషల్ మీడియా మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి వాటి ద్వారా కస్టమర్లకు చేరువై వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
ఇంటివద్దనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి కావాల్సింది ముందుగా ఒక గది. డిజైనరీ డ్రస్సెస్ కుట్టేందుకు అవసరమైన సామాగ్రి, మెటీరియల్స్, కుట్టుమిషన్లు. ప్రారంభంలో తక్కువ పని ఉంటుంది కాబట్టి రోజులో కొంత సమయాన్ని ఇందుకోసం కేటాయిస్తే సరిపోతుంది. ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే ముందుగా కావాల్సింది వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించటం.

ప్రారంభమైన కొన్ని నెలల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్య వ్యాపారం నుంచి ఆర్జించవచ్చు. బిజినెస్ పెరుగుతున్న కొద్ది మీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. యువత మెచ్చే క్వాలిటీ డిజైన్స్ అందించటం వల్ల మౌత్ పబ్లిసిటీ లభిస్తుంది. ఇది మీ వ్యాపారాన్ని తక్కువ కాలంలో వృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని గుర్తుంచుకోండి. ఇదే క్రమంలో గృహిణులు మెచ్చే నేటి తరం ఫ్యాషన్ చీరలను, చిన్నచిన్న వర్క్స్ చేసిన చీరలను విక్రయించవచ్చు. ప్రారంభంలో ఎదురయ్యే సమస్యలతో వెనుతిరగక ముందుకు సాగితే ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు.


Click it and Unblock the Notifications