మహిళలకు రూ.3 లక్షలు వడ్డీలేని రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Udyogini Scheme: తమకాళ్ల మీద తాము నిలబడాలని, మంచి వ్యాపార ఆలోచనలు ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే చాలా మంది ఆర్థిక సహకారం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి మహిళలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన నిరుద్యోగి పథకం గురించి తెలుసుకోవాల్సిందే. దీనిని తొలుత కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తర్వాత దేశవ్యాప్తంగా దీనిని కేంద్ర ప్రభుత్వం ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కీమ్ కింద నిర్థేశించిన 88 రకాల వ్యాపారాల్లో దేనికోసమైనా మహిళలు రుణాన్ని పొందేందుకు వీలు ఉంటుంది.

వితంతువులు, అంగవైకల్యం కలిగిన మహిళలకు మాత్రం ఎలాంటి రుణ పరిమితిని విధించలేదు. వారు ఈ పథకం కింద ఎలాంటి వడ్డీ లేకుండా మహిళలకు రూ.3 లక్షల వరకు లోన్ పొందేందుకు కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు మాత్రం 10- 12 శాతం వడ్డీకి రుణాలను అందిస్తోంది. బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటుండగా.. వారి కుటుంబ వార్షిక ఆదాయం ప్రకారం రుణ మెుత్తంలో గరిష్ఠంగా 30 శాతం వరకు సబ్సిడీని పొందుతారు.
ఈ స్కీమ్ కింద సదరు వ్యాపారంలో రాణించటానికి అవసరమైన శిక్షణను సైతం అందించటం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 48,000 మందికి పైగా మహిళలు ఇప్పటి వరకు స్కీమ్ కింద రుణాలను పొంది లబ్ధిని పొందారు. 18-55 ఏళ్ల మధ్య మహిళలు ఈ రుణాన్ని పొందటానికి అర్హులు. వీరి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్షన్నర రూపాయలకు మించకూడదు. దరఖాస్తుకు ఆధార్, రేషన్ కార్డు, ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్, కుల నివాస ధృవీకరణ పత్రాలు అవసరం ఉంటుంది. దగ్గరలోని బ్యాంక్ శాఖను సందర్శించటం ద్వారా ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.


Click it and Unblock the Notifications