ఆ నిశ్శబ్దం నన్ను భయపెట్టింది".. లక్షల మందిని ఆలోచింపజేస్తున్న ఒక మాజీ ఉద్యోగిని వైరల్ పోస్ట్!

ఈ రోజుల్లో కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేసే చాలా మందికి ఒకటే కోరిక ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రెజర్, టార్గెట్లు, మేనేజర్ల తిట్లు వదిలించుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దామా అని. వీకెండ్స్ కోసం ఎదురుచూడటం, సోమవారం వస్తే చాలు ఆఫీస్‌కి వెళ్లాలనే భయం (Monday Blues) తో సగం మంది సచ్చిపోతుంటారు. అందుకే స్థిరమైన ఆదాయం వచ్చే జాబ్ ని వదిలేసి, ఫ్రీడమ్‌గా బతకాలని కలలు కంటారు. కానీ, నిజంగానే ఆ లగ్జరీ ఉద్యోగాన్ని వదిలేసి బయటకొస్తే లైఫ్ ఎలా ఉంటుంది? మనం అనుకున్నంత కలర్‌ఫుల్‌గా ఉంటుందా? హియా ధరివాల్ అనే యువతి తన కార్పొరేట్ లైఫ్‌కి గుడ్ బై చెప్పాక ఎదురైన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదిప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Woman Quits Corporate Job Shares Real Experience Of Life After Quitting Career Break Story

ఊహల్లో ఒకలా.. నిజ జీవితంలో ఇంకోలా!

హియా ధరివాల్ తన లింక్డ్‌ఇన్ (LinkedIn) పోస్ట్‌లో మనసు విప్పి మాట్లాడింది. "చాలా కాలం పాటు, కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలేయాలనే ఆలోచన నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించేది. ఫిక్స్డ్ షెడ్యూల్స్ ఉండవు, సోమవారం టెన్షన్ ఉండదు, వీకెండ్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.. కేవలం స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది అనుకున్నా. కానీ నేను నిజంగా నా ఉద్యోగం (job) వదిలేసినప్పుడు, రియాలిటీ చాలా భిన్నంగా అనిపించింది" అని రాసుకొచ్చింది.

ఆఫీస్ వదిలేశాక ఆమెకు ఎదురైన అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? 'రూటీన్' లేకపోవడం. అవును, ఆఫీస్‌లో ఉన్నప్పుడు రేపు ఏం చేయాలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఉద్యోగం పోయాక, పొద్దున్నే లేచి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు, టీమ్ కాల్స్ లేవు, టార్గెట్లు లేవు. దాంతో ఒక్కసారిగా చుట్టూ ఉన్న నిశ్శబ్దం ఆమెను భయపెట్టడం స్టార్ట్ చేసింది.

నాతో నేనే యుద్ధం.. ఆ నిర్ణయం తప్పా?

ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు మైండ్‌లోకి రకరకాల ఆలోచనలు వస్తాయి కదా! హియాకి కూడా అలాగే అనిపించిందట. "నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అని నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. కార్పొరేట్ లైఫ్ ఇచ్చే ఆ స్టెబిలిటీ (ఆర్థిక స్థిరత్వం) ని నేను చాలా తక్కువగా అంచనా వేశానా? అనిపించింది" అంటూ తన లోపలి భయాన్ని బయటపెట్టింది. స్వేచ్ఛ కావాలనుకోవడం తప్పు కాదు కానీ, ఒక పద్ధతి లేని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఆమె మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

కార్పొరేట్ లైఫ్ నేర్పిన పాఠాలు

అయితే, తను ఉద్యోగం వదిలేసినందుకు హియా బాధపడటం లేదు. కార్పొరేట్ రంగం తనకు ఎన్నో మంచి విషయాలను నేర్పిందని అంటోంది. "జీవితంలో ప్రతి ఫేజ్ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. కార్పొరేట్ జాబ్ (corporate job) నాకు క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం, , ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈరోజు నేను ఆలోచించే విధానాన్ని మార్చిన ఎంతోమంది మంచి వ్యక్తులను నాకు పరిచయం చేసింది" అని చాలా పాజిటివ్‌గా చెప్పింది.

ప్రస్తుతం నడుస్తున్న 'బర్న్‌అవుట్' ట్రెండ్!

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు విపరీతమైన పని ఒత్తిడి వల్ల 'బర్న్‌అవుట్' (తీవ్ర అలసట, మానసిక ఒత్తిడి) కి గురవుతున్నారు. అందుకే కెరీర్ బ్రేక్స్ తీసుకోవడం, లేదా ఉద్యోగాలు వదిలేసి నచ్చిన పని చేసుకోవడం ఎక్కువైంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటే సరిపోదు, జీవితంలో ప్రశాంతత ఉండాలని కోరుకుంటున్నారు. హియా కూడా ప్రస్తుతం తను కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని, భవిష్యత్తు గురించి కొంచెం భయంగా ఉన్నా.. అంతే ఎగ్జైటింగ్‌గా కూడా ఉందని ముగించింది. ఏదైనా సరే, ఉన్నపళంగా ఉద్యోగం వదిలేసే ముందు, ఆ తర్వాత వచ్చే ఖాళీ సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం సుమా!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+