కరోనా-లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గతంలో రూ.7 లక్షల కోట్లకు పైగా ప్రకటన వచ్చింది. బుధవారం నుండి వరుసగా రెండు రోజుల పాటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ ప్యాకేజీపై కొంతమంది ఆర్థికవేత్తలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది అసంతృప్తిగా ఉందని చెబుతున్నారు. ఈ ఉద్దీపనల వల్ల ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా వచ్చేది లేదని చెబుతున్నారు. అలాగే కేంద్రం రూ.12 లక్షల కోట్ల రుణాలకు స్పందించి స్పష్టత లేదని చెబుతున్నారు.

నగదు బదలీ లేకుంటే..
మార్చి నెలలో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. ఈ ప్యాకేజీలో భాగంగా 80 కోట్ల మంది పేదలకు రేషన్, నగదు బదలీ వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్బీఐ రూ.6 లక్షల కోట్లు ప్రకటించింది. మొన్న నిర్మలా సీతారామన్ రూ.6 లక్షల కోట్లను ఎంఎస్ఎంఈ, రియాల్టర్లు, డిస్కంలకు ప్రకటించారు. నిన్న రైతులు, వలసకూలీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇందులో ప్రత్యక్ష నగదు మద్దతు ఎంతో స్పష్టత లేదు. అదే సమయంలో నగదు బదలీ లేకుంటే ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభావం తక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంటే నగదు బదలీ ఉండాలని చెబుతున్నారు.

ఆ లెక్కన ఇది ఉద్దీపన కాదు
ఆర్థిక ఉద్దీపన సాధారణంగా బడ్జెట్ కేటాయింపుల కంటే అదనపు ఖర్చులు, అదనపు కేటాయింపులు కనిపిస్తుంది. ఆ లెక్కన బుధ, గురువారం ప్రకటించినవి ఉద్దీపనలుగా చెప్పబడవని అంటున్నారు. ఎంఎస్ఎంఈలు, రైతులు లేదా సమాజంలోని బలహీనవర్గాలకు తక్షణమే రుణాల రూపంలో వివిధ చర్యలు ప్రకటించారు. ఉదాహరణకు రుణాలు తీసుకునే రైతులు ఇప్పటి నుండి కొద్ది నెలల తర్వాత మాత్రమే పంటల ద్వారా ప్రయోజనం పొందుతారు.

ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా వెళ్లేలా లేదు
ఇప్పటి వరకు చేసిన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వల్ల ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా వెళ్లేలాలేవని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ అండ్ డైరెక్టర్ (పబ్లిక్ ఫైనాన్స్) సునీల్ కుమార్ సిన్హా అన్నారు. 2.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.2 లక్షల కోట్ల రుణ ప్రోత్సాహకం, ఎంఎస్ఎంఈల కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలను బుధవారం ప్రకటించారు. కేంద్రం గత వారం రుణ లక్ష్యాన్ని రూ.7.8 లక్షల కోట్ల నుండి రూ.12 లక్షల కోట్లకు పెంచింది. అదే విధంగా ఆర్బీఐ లిక్విడిటీ, పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి స్కీంలు రూ.20 లక్షల కోట్లలో భాగం. వలస కార్మికులకు సంబంధించిన ప్రకటనలు దీర్ఘకాలికంగా సహకరిస్తాయని ఉంటుందని చెబుతున్నారు. బుధవారం ప్రకటించిన రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రభావం FY21 ఆర్థిక లోటుపై రూ.20,000 కోట్ల కంటే తక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications