Gold: గోల్డ్‌లో బ్రిడ్జ్ బయింగ్ అంటే ఏమిటీ.. దీని వల్ల ఉపయోగం ఉందా..!
బంగారం ధరలు ఓ రోజు పెరిగితో మరో రోజు తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలా లేక ఆగాలా అనే అయోమయంలో చాలా మంది ఉన్నారు. బంగారం పెట్టుబడి పెట్టుబడిదారులలో వివిధ రకాలు ఉన్నారు. ఇందులో భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టేవారు, అలాగే తక్షణ అవసరం కోసం బంగారం కొనుగోలు చేసేవారు. రెండో రకానికి చెందినవారు తక్షణ అవసరం ఉంది కాబట్టి పసిడి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ మొదటి రకానికి చెందినవారు వేచి చూస్తూ కొనుగోలు చేయడం మంచిది. అయితే వీరు ఫిజికల్ గోల్డ్ కాకుండా గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్ కోసం పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టడం వల్ల సెక్యూరిటీ ఉంటుందని చెబుతున్నారు.
మీరు భవిష్యత్ లో గోల్డ్ ఈటీఎఫ్స్ విక్రయించి ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేయవచ్చు. బంగారం ధర ఎలా మారుతాయో గోల్ట్ ఈటీఎఫ్స్ కూడా అలానే మారుతాయని కాబట్టి పెద్దగా నష్టం ఏం ఉండదు. అలా కాకుండా మీరు ఇప్పుడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే కొద్ది సంవత్సరాల తర్వాత వాటిలో తరుగు తీస్తారు. అలాగే వాటిని భద్రంగా దాచి ఉంచాలి. అందుకే గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ నుంచి ఆభరణాల కొనుగోలు చేసే వ్యూహాన్ని బ్రిడ్జ్ బయింగ్ స్ట్రాటజీ అని అంటారు. గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టి అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బు డ్రా చేసి బంగారం కొనడాన్ని బ్రిడ్జ్ బయింగ్ అంటారని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఒక అర తులం ఆభరణం కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం రేటు ప్రకారం పన్నులతో కలికి దాదాపు రూ.60 వేలకు పైగా చెల్లించాలి. కానీ గోల్డ్ ఈటీఎఫ్ రూ.500 ఉన్న పెట్టుబడి పెట్టొచ్చు. ఉదాహరణకు రాజు అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి 12 సంవత్సరా కుమార్తె ఉంది. రాజు తన కూతురికి 24 ఏళ్ల సమయంలో పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇప్పటి నుంచి బంగారం కొనుగోలు చేయాలనుకున్నాడు. ప్రస్తుతం అతని వద్ద రూ.3 లక్షలు ఉన్నాయి. ఆ డబ్బుతో బంగారం ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. కానీ అతడు గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడి పెడితే.. బంగారం ధరలు పెరిగితే అతడి పెట్టుబడి పెరుగుతుంది. తగ్గితే తగ్గుతుంది కాబట్టి ఎలాంటి భయం ఉండదు.
పైగా అతను మరో రెండు సంవత్సరాల తర్వాత రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా అతను దాదాపు రూ. 20 పెట్టుబడి పెట్టాడు. అప్పటికీ ఆయన కూతురుకు 24 ఏళ్లు నిండాయి. సంబంధం కూడా ఒకే అయింది. దీంతో అతను గోల్డ్ ఈటీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకుని అదే డబ్బుతో బంగారం కొనుగోలు చేయవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications